*శ్రీ కృష్ణ శతకము* - పద్యం (౯౩ - 93)

 కందము :
*నారాయణ లక్ష్మీపతి*
*నారాయణ వాసుదేవ | నందకుమారా*
*నారాయణ నిను నమ్మితి*
*నారాయణ నన్ను బ్రోవు | నగధర కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా....
నీటిని నీ ఇల్లు చేసుకుని వున్నవాడవు, నారాయణా. లక్ష్మి దాని వికి భర్తవు.  ఎన్నో అవతారములు ఎత్తినప్పుడు మానవ రూపములొ రాముడిగా, కృష్ణుడిగా, పరశురాముని గా వచ్చినవాడా. నందుని కొడుకువు కూడా నీవేగా కృష్ణా.  ప్రజలందరికీ ఆధారమై వున్న నారాయణ. నిన్నే నమ్ముకుని వున్నాను.  నీవు శబ్ద వేగమయతో సమానంగా ప్రయాణించ గలవాడివి.  ప్రజలకు రక్షణ కలిగించడానికి కొండను గొడుగుగా ఎత్తి జీవులు అందరినీ కాపాడిన వాడివి.  అటువంటి నిన్ను వేడుకుంటున్నాను ల, నన్ను కాపాడు తండ్రీ.....అని శతకకారుడు నృసింహ కవి వాక్కు.
*జలమును స్థానము చేసుకున్న, నారాయణ - నరావతారములు ధరించిన, నారాయణ - నరులను అందరినీ నీలోనే నిలుపుకున్న, నారాయణ- నీ వాళ్ళను కాపాడడానికి కొండ గొడుగుగా పట్టిన, నారాయణ, లక్ష్మీపతి వైన, నారాయణ - ఇలా ఎన్ని విధాలుగా చూచినా, ఎక్కడ చూచినా, నీవే నిండి వున్న ఈ ప్రపంచంలో నిన్ను గాక వేరెవ్వరున్నారు, దేవదేవా!  ఏపేరుతో పిలిచినా పలకేది నీవే గదా, పరాత్పరా!  అటువంటి నీ పాదాలను పట్టకుని వుండే స్పృహ నాకు నువ్వే కలిగించాలి. "తిరుమల మందిర సుందర- సుమధుర కరుణా సాగర- ఏపెరున నిను పిలిచేమురా- ఏరూపముగా కొలిచేమురా!!"*
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు