గర్వ భంగం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  జయపురంలో మహీపతి అనే గురువు ఒక గురుకులం స్థాపించి విద్యార్థులకు అనేక కొత్త అంశాలు,విశేష శాస్త్ర విషయాలు,కళలు బోధించేవాడు.
        ఆయన బోధనా పద్ధతులు నచ్చి జయపురం రాజు తన పుత్రుడు సుగుణాకరుణ్ణి ఆ గురుకులంలో చేర్చాడు.సుగుణాకరుడు ఎంతో ఆసక్తితో విద్య అభ్యసిస్తూ అనేక పురాణాలు,ఉపనిషత్తులు,తాత్విక కథలు నేర్చుకున్నాడు,వాటిని విశ్లేషించే స్థాయికి ఎదిగాడు.క్రమేపీ సుగుణాకరుడిలో తనే తెలివైన వాడిననే గర్వం పొడచూప సాగింది!
         సుగుణాకరుడిలో వచ్చిన మార్పును గురువు మహీపతి గమనించి తగిన సమయంలో తగిన విధంగా చెప్పి సుగుణాకరుడి గర్వం తొలగించాలని నిశ్చయించాడు.
       ఒకరోజు విద్యార్థులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ "సమస్తం భగవంతుని సృష్టే పశుపక్ష్యాదులు,వృక్షసంపద,ఆఖరికి మనిషి మేధస్సు కూడాఆయన సృష్టే"అని చెప్పాడు.
        వెంటనే సుగుణాకరుడు లేచి "ఆచార్యా,భగవంతుడి సృష్టికి భిన్నంగా నేను సృష్టించగలను,తమరు అనుమతిస్తే"అని వినయంగా అడిగాడు.
      గురువు ఆశ్చర్య పోయి "భగవంతుడు సృష్టించలేనిది సృష్టించు నాయనా,నేను చూస్తాను"అని చెప్పారు గురువు.
     తరువాత సుగుణాకరుడు దూరంగా ఉన్న ఒక రాతి పలక మీద సుద్ద ముక్కతో ఒక వింత చిత్రం గీసాడు.అతని మొహంలో చిరునవ్వు చిగురించింది గర్వంతో.గురువు గారిని ఆచిత్రం వద్దకు తీసుక వెళ్ళి ఈ విధంగా చెప్పాడు."గురువుగారూ ఈబొమ్మ చూడండి,భగవంతుడు సృష్టించని,సృష్టించలేని  ఒక జంతువును సృష్టించాను.ఈ జంతువుకి ఏనుగ కాళ్ళు,పక్షి రెక్కలు,సింహంతల,ఎద్దు కొమ్ములు,పాముతోక..."అంటూ ఆచిత్రాన్ని గురించి గర్వంగా వివరించాడు.
            "ఆగు నాయనా ఆగు ఇందులో నీవు నీవు సృష్టించిన కొత్త జంతువు ఏదీ లేదు,నీవు గీసిన ఈ చిత్రంలోని జంతువు అవయవాలన్నీ భగవంతుడు ఇంతకు ముందు సృష్టించినవే!అవన్నీ నీవు ఒక చోటకు చేర్చి లేక అమర్చి నాసృష్టి అని చెప్పుకోవడంలో అర్థం ఏముంది?నీవు సృష్టించాలంటే ఈ ప్రపంచంలో అసలు ఇంతవరకు లేనిది సృష్టించాలి కదా!ఇప్పుడు శాస్త్రజ్ఞలు కనిబెడుతున్న పరికరాలకు, మూలసూత్రాలు భగవంతుడు సృష్టించినవే కదా!,ఆలోచించు"అని వివరించారు గురువు.
         గరువు చెప్పిన మాటలను గురించి తీవ్రంగా ఆలోచించాడు సుగుణాకరుడు.గురువు చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాక సుగుణాకరుడులోని గర్వం తొలగిపోయింది.
          "నన్ను క్షమించండి గురువు గారూ,ఇన్నాళ్ళూ నేనే తెలివిమంతుడని విర్రవీగాను...ఇప్పుడు తెలిసింది నేను నేర్చుకోవలసింది ఎంతో ఉందని,తెలుసుకోవలసిన ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయని"అంటూ తలవంచిగురువుగారి పాదాలకు నమస్కారం చేశాడుసుగుణాకరుడు.
       గరువుగారు సుగుణాకరుణ్ణి ఆశీర్వదించాడు.
(మంజిత్ బావా చిత్రం చూశాక వచ్చిన ఆలోచన ఈ కథ)
                   

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం