త్రిపదలు:-చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.చరవాణి:9381361384

 1)చురుకుగా కదిలితేనే ...
చైతన్యానికి గుర్తు...
యంత్రమైనా...శరీరమైనా...!
2)ఏడు వర్ణాలు కలిస్తే శ్వేతవర్ణం...
ఏడడుగులు నడిస్తే వివాహబంధం...
ఎనలేని భావాల కలగలుపు మౌనం...!
3)మొదలంటా నరికినా...
మరలా చిగురిస్తూ...
ఆశావాదాన్ని చాటే తరువు...!
4)మండే వేసవి ఎండలలో మల్లెలు...
వేదనలోనే తెలిసే మమతల విలువలు...
మంచీ చెడుల కలయికలే మనుషులు...!
5)తీసుకునేది దోసెడు...
తిరిగిచ్చేది గంపెడు...
లాభాల లెక్కలు ఎరుగని తరువు...!

కామెంట్‌లు