మా చైతన్య భారతి:---గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సల్.నెం.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

ఆహోఅందరి చైతన్యం నీవులే భారతి
సాహో సుందరం నైపుణ్యంలే నీహారతి

వత్తి ఒడి గడ్డకుండ వెలుగుతూనే ఉంటుంది
అత్తిపత్తి మడి నిండా వెలుగులీను వుంటుంది

తా చక్కనైన చిక్కని వెలుగులనే పంచు
ఏ మొక్కవోని మక్కువనే మదిలో కలిగించు
సదా తాను వెలుగుతూనే ఉంటుంది
పదా ఆ పరమాత్ముని పూజకే అంటుంది

ఆ వెన్నెలమ్మ చల్లదనం పంచుకున్నది
ఈ కూనలమ్మ వెచ్చదనం ఎంచుకున్నది
దివ్య మై భవ్యమై ఈ దీపం వెలుగుతున్నది
నవ్యమైన సవ్యమైన దారిలోన మెలుగుతున్న ది

జడివాన జోరుగానే దండయాత్ర చేస్తున్నా
ఉరుములు మెరుపులతో ఆ కొండ గాలి వీస్తున్న
ఆదర కుండ బెదరకుండ వెలుగుతూనే ఉంది
తొణక్కుండ బెణక్కుండ వెలుగు లీను తుంది


అమ్మలక్క లందరూ వస్తు పోతూ ఉన్నారు
చమ్మచక్క లేస్తూ మస్తుగా డుతున్నారు
చైతన్యం ప్రమిదకు బొట్టు పెట్టు చున్నరు
నైపుణ్యం ప్రమోదులై జట్టు కట్టు చున్నరు.


తరాలు మారినా ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది
వరాలు కోరినా మన పాపం మిగులుతానంటుంది
ఈ చైతన్యం హారతికి వందనం అభివందనం
మా నైపుణ్యం భారతికి నందనం నవ చందనం!

కామెంట్‌లు