రుధిర జ్వాలకు జోహార్!:-కిలపర్తి దాలినాయుడు9491763261
ఉన్నత స్థానాన్ని గెలుచుకున్న కవిత*
***********************************************
భారత మాతను తెల్ల ఏనుగులు
కాళ్ళతో కుమ్ముతున్నవేళ...
సింహ స్వప్నమై పుట్టాడు అల్లూరి !విప్లవఝరి!

ఆకులు అల్లాడినా
చెట్లు తలలుపినా
కారణమని గిరిజన గూడేన్ని
హింసించిన తెల్లకుక్కలను
వెంట దవిలిన
నిజ నాయకుడు సీతారామరాజు!

పాండ్రంకిలో విప్లవకోదండమైన
ఉదయించిన రోజున
భరతమాత ఎంత పులకించిపోయిందో!

అటవీ చట్టలతో ఆటవికంగా
ఆడుకొన్న తెల్ల తుపాకులను
ఆకులు ఏరినట్టు ఏరిన
ధీశాలి ఈ స్వాంత్ర్య సమర యోధుడు!

నిరక్షరాస్యులలో ఉద్యమ స్ఫూర్తి
నింపిన గెరిల్లాయోధుడు!
ఓ రూధర్ ఫడ్!
నువ్వు మా భరతమాత బిడ్డ
రుధిరాన్ని నీ తూటాతో చిందింపజేసావు!
అది రక్తబిందు సహస్రమై
మాలో వేన వేల సీతారామరాజులను
ఉదయింపజేయలేదూ!

నువ్వు తూటాబాటవేసావుగాని
నా దేశం దేహాలు గోడలై నిలచాయిగానీ
గోడుగోడున ఏడ్వలేదు!
మా రాజుకు జోహారు
అగ్ని కీలకు జోహారు!


కామెంట్‌లు