*లక్ష్యం*:-బెజుగాం శ్రీజ-ట్రిపుల్ ఐటీ బాసరాద్వితీయ సంవత్సరం.గుఱ్ఱాలగొంది సిద్ధిపేట జిల్లాచరవాణి:9704865816

చదువు పైన మనము శ్రద్ధను చూపించ
పెరుగు నండి తెలివి వెలుగు కొరకు
శ్రద్ధతోడ చదివిశాస్త్రకోవిదులైతె
మంచి పేరు వచ్చు మనకు నెపుడు

చదువు నేర్చుకొనగ సంస్కారమబ్బును 
రోజు బడికి వెళ్ళు రూఢిగాను
పుస్తకాలుచదివి పూర్తిగా జ్ఞానాన్ని
పెంచు కొనినయంత పేరువచ్చు

ఎక్కు చుండవలయు
ఒక్కొక్కమెట్టును 
చేరగలము పైకి జీవితాన
అన్ని మెట్ల నెక్కి ఎన్నొన్నొ సాధించి
లక్ష్యములను చేరు రయముగాను.
కామెంట్‌లు