పొరపాటు:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి.మొబైల్: 9908554535.

  పట్టణంలో ఒక పెద్దమనిషి బస్సు దిగాడు. అతనికి రోడ్డు దాటి వెళ్లడం చాలా కష్టమైంది. అప్పుడు ఒక అమ్మాయి ఆ ముసలి వాడిని రోడ్డు దాటించింది .ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలిపి ఆ ముసలివాడు వెళ్ళిపోయాడు.
       ఆ తెల్లవారి ఒక పేపర్లో అతని ఫోటో చూసి ఆ అమ్మాయి అవాక్కయింది. అందుకు కారణం అతడు ఒక పెద్ద దొంగ అని ఫోటో వార్త పడింది. " అయ్యో! ఇంత దుర్మార్గుడైన వాడిని నేను రోడ్డు దాటించానా! కానీ నాకు అలా కనిపించలేదే! అతడు దొంగ అంటే నమ్మలేకుండా ఉన్నాను .నేను జాలి పడటం తప్పయింది "అని నిట్టూర్చింది .
             మరునాడు తెల్లవారి అదే పేపర్లో సవరణ అని పెద్దపెద్ద అక్షరాలతో పడింది. అందులో ఆ ముసలివాడు దొంగ అని పొరపాటుగా పడిందని, అసలు దొంగ ఫోటో దగ్గర సామాజిక సేవ చేసినందుకు అవార్డు అని పడిందని ,అటుది ఇటు ఇటుది అటు పొరబాటుగా పడ్డాయని, ఫోటోలు కూడా తారుమారు అయ్యాయని ,ఈ పొరపాటుకు చింతిస్తున్నామని వ్రాశారు .అది చదివిన ఆ అమ్మాయి "అమ్మయ్యా! అతడు దొంగ కాదని , సామాజిక సేవా అవార్డు గ్రహీత అని తెలుసుకుని తాను ఊహించింది నిజమైనందుకు ఆమె సంబరపడింది.


కామెంట్‌లు