విశ్వకవి(ఇష్టపది):-డా. అడిగొప్పుల సదయ్యఅధ్యక్షుడుమహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం9963991125
జననమొందితివీవు ఘనవంగదేశమున
దేవేంద్ర నాథునకు దేవి శారదాంబకు

బహుముఖంబైనట్టి ప్రజ్ఞ దీపములెసగ
విశ్వమంతయు పాకి విహరించె నీ కీర్తి

సాహిత్యరంగమున సాధించితివి గొప్ప
నోబెలను బహుమతిని నూరేళ్ళ కిందటే
 
గురుకులపు పద్ధతిని కొలతగా తీసుకుని
విద్యావిధానమును విరచించితివి నీవు
 
విశ్వభారతి విశ్వ విద్యాలయము శాంతి
నికేతనమను పేర నిలిపితివి వసుధపై

భక్తి గీతాలన్ని ముక్తి దాయకములుగ
గీతాంజలను పేర కూర్చి ధరకిచ్చితివి

నవ్యరీతుల శుద్ధ నవలా స్రవంతిలో
చదువరుల మది దోచి కదిలింపజేసితివి

కళాభవనము పెట్టి కళలన్ని పోషించి
సకల కళ రాజువై వికసించితివి మిగుల

భారతీయాత్మలను బంధించి జనగణను
జాతీయ గీతమున జాగృతము చేసితివి

గాంధీ మహాత్ముడే గౌరవించెను నిన్ను
గురుదేవ యనిపిలిచి గొప్ప బిరుదమునిచ్చి

రవి తేజ! కవి రాజ! రవీంద్ర నాథుడా!
జోత గీతాంజలిది ప్రీతితో నందుకో!కామెంట్‌లు