*ఆదర్శమూర్తులు*:---మంజీత కుమార్--బెంగుళూరు
బడియే బోధి వృక్షము
గురువే దైవము

పాఠశాల తోటలో విద్యార్థి విత్తనాలు నాటి
పువ్వులనే వికాసాన్ని వికసింపజేసీ
సువాసనల విజ్ఞానాన్ని అందించే
అక్షరాల రైతులు

అమ్మానాన్నల ప్రేమకు మరోరూపు వీరు
మట్టిలో మాణిక్యాన్ని వెలికితీసే నేర్పరులు
చీకట్లను పారద్రోలి వెలుగును నింపే దివ్వెలు
భావి భారత పౌరులను తీర్చిదిద్దే శిల్పులు

విద్యార్థి అభివృద్దే గురుదక్షిణ
ఎదుగుదలే వారికి తీయటి ఫలం
ఏమిచ్చి తీర్చుకోము నీ ఋణం
అందుకో మా పాదాభివందనం


కామెంట్‌లు