మెరిపించు ప్రభాతమై(కైతికాలు):-రమేశ్ గోస్కుల-కైతికాల రూపకర్త.

ఉరికించి, ఉడికించి
ఉత్సాహం కలిగించి
రాయిలాంటి మనసుకు
రమ్యతను అందించి
అవుతుంది కవిత్వం
ఆనందపు కేదారం

కరుడుగట్టిన మబ్బుల
చినుకులు గా కురిపించి
వికసించు మొగ్గలకు
సుగంధాల నద్దించి
ఘనమైనది కవిత్వం
చైతన్యపు సరాగం

చీకట్లను చెదరగొట్టి
రేపటికి ఆశలు పెంచి
కమ్ముకున్న మబ్బు లను
కదిలించి వెలుగు పంచి
ఔనౌను కవిత్వం
తగ్గించును జడత్వం

మూఢత్వం తొలగించి
మూర్తులు గా తీర్చును
తెలివిడిని పెంచుతూ
కొత్త దారులు చూపును
చదివి చూడు కవిత్వం
నీలో నిండు నవ్యత్వం

హృదయాన్ని ఎదిగించి
రుధిరాన్ని కదిలించి
జవసత్వాలను నిలిపి
జయగీతమై నిలిచి
వెలిగించే కవిత్వం
వేకువలకు తోరణం

అక్షరాల గుంపులు
పదనిసల  విందులు
భావాలతో వెలిగించి
మది నింపు విల్లులు
గుంపులు గా కదులుతూ
గుండెలు వెలిగించును

 సామాజిక వర్గాల
స్ప్రశించి చూపును
సాగర కెరటాలతో
సమంగా దూకును
వారేవ్వా కవిత్వం
వాడనట్టి సుమగంధం

బేధాల తీరు చెప్పి
పడు బాధలు వినిపించును
భావుకతను పెంచుతూ
బ్రహ్మాండం చేధించును 
నిజమేలే కవిత్వం
నిప్పు తోడ సమానం

మానవత్వంను పెంచి
రాక్షసత్వం ను తుంచి
పువ్వులాంటి మనసులకు
పులకించుట నేర్పించి
నిజం నిజం నిరంతరం
నివురుగప్పి నినదించును

మది పొరలను దాటుకొని
అలవోకగ దూకిపడి
అంతరంతరాలను 
విద్వత్తు తోడ నిండి
మెరిపించును ప్రభాతమై
గాయం మాటున చిగురులను.

కామెంట్‌లు