చెట్లు పెంచేద్దాం రండి:-- కుంటముక్కుల సత్యవాణి

 ఈ భూమిని దివిగా మార్చేద్దాం
నందన వనాలను మన నట్టింటికి తెచ్చేద్దాం
అపుడు కురుస్తాయి వానలే వానలు
ఆ వాన నీటిని ఒడిసి పట్టేద్దాం, వృధాగా పోనీక
ఇంటింటికి ఒక ఇంకుడు గుంత తవ్వుదాం
నీటి కరువు రాకాసిని తరిమి తరిమి కొడదాం
మళ్లీ ఎపుడూ మన పొలిమేరలకి రాకుండా
చెరువులలో, దొరువులలో పూడికలు తీసేద్దాం
పంట చేలని సస్యశ్యామలం చేసేద్దాం
“అన్నపూర్ణ' మన ఇంటి ఆడపడుచు అన్నది
ఎప్పటి మాటో కాదు
ఎప్పటికీ, ఇప్పటికీ ఉన్నమాటే
ప్రజలంతా చెయ్యీ, చెయ్యి కలిపితే
పరిశుభ్ర భారతం అదిగో కాదు
ఇదిగో ఇప్పుడే, ఇక్కడే!

కామెంట్‌లు