చిన్నతనం --సింహావలోకనం ..!!:-------శ్యామ్ కుమార్, నిజామాబాద్.

 మన చిన్నతనంలో మనకు కలిగే సంఘటనలు కొన్ని విషయాలు మన జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసి పోతుంటాయి .కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా మర్చిపోతాం,  కానీ చిన్న చిన్న సంఘటనలు మన జ్ఞాపకాలలో ఏ మూలనో ఎప్పటికీ ఉండిపోతాయి. అలాగే కొందరు వ్యక్తులు ,కొందరు స్నేహితులు చిన్నతనంలో మనం చేసిన అల్లరి పనులు, ఎవరికీ గుర్తు ఉండవు,కానీ మన కు గుర్తుండిపోతాయి.
**************************************
 అప్పుడు నావయసు బహుశా నాలుగు సంవత్సరాలు  అనుకుంటా . మా ఇంటి బయట కూర్చుని నేను హాయిగా మట్టిని  భోజనం చేస్తున్నాను. నా కా మట్టి రుచి ఇంకా గుర్తుంది. ఇంతలో మా నాన్నగారు మెట్ల నుంచి దిగుతూ లుంగీ సరిచేసుకుంటూ పరిగెత్తుకు వచ్చి ,చేతిలో ఉన్న సిగరెట్ తో నా పెదాల మీద కాల్చారు. అంతే దాని తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. కానీ నేను ఎప్పుడూ మట్టిని మరి ముట్టలేదట.
****************************************
 మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయి పేరు కూడా శ్యామ్ అతను నేను రోజూ ఆడుకునేవాళ్లం. ఒకరోజు ఎక్కడినుంచో అగ్గిపెట్టె సంపాదించాం. వాళ్ల ఇంటి ముందు  గడ్డివాము దగ్గర లో ,దూరంగా పడి ఉన్న గడ్డిని దగ్గర దగ్గరగా చేసి అగ్గిపుల్లలతో   వెలిగించాను. అది కాసేపు కాలుతూ ఉంటే ఎంతో సంతోషంగా గంతులు వేసాను. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు కాసేపట్లో  అది   ఆరి పోయింది.  కాస్త పక్క కు తిరిగి మళ్ళీ అక్కడ గడ్డి దగ్గరగా చేసి అది   వెలిగించాను, అక్కడా అదే పరిస్థితి కాసేపట్లో ఆగిపోయింది. కాసేపటికి మాకు తెలియకుండా గడ్డివాము దగ్గర లో  అదే పని చేశాను. . మేము గమనించే లోపు ఆ మంట కాస్త    గడ్డివాము  కు అంటుకొని గడ్డివాము కాలి పోవడం మొదలుపెట్టింది . చుట్టూ ఉన్నవాళ్లంతా అరుపులు, కేకలు పెడుతూ బకెట్ ల లో నీళ్ళు తీసుకొని వచ్చి దాన్ని  ఆర్పటం మొదలు పెట్టారు, దానికి చాలా సేపు పట్టింది. దాదాపుగా సగం గడ్డివాము    కాలి   పోయింది.  అప్పుడు నాకు అర్థం అయిపోయింది మేము చేసిన తెలివితక్కువ పని ఎలాంటిదో. కానీ ఏం లాభం అప్పటికే  మాకు  పెద్ద వాళ్ళతో దెబ్బల కార్యక్రమం అయిపోయింది .
****************************************
 మేము అప్పుడు కంటేశ్వర్ లో ఉండేవాళ్ళం. బహుశా నా వయసు దాదాపుగా పది పదకొండు సంవత్సరాలు ఉంటుందనుకుంటాను. ఇరుగుపొరుగు వారితో పెద్దవారు చాలా స్నేహంగా ప్రేమగా వ్యవహరించేవారు. కులగోత్రాలు  , మతాలు,ఏమి అడ్డు వచ్చేవి కావు. మా నాన్నగారు పక్కింటి వారితో"  ఏమ్మా, నీ కూతురు సుశీలను మా అబ్బాయికి ఇస్తావా ?నా కొడుక్కి చేసుకుంటాను"  అని  చమత్కారంగా అనేవారు.  సుశీల పెద్ద కళ్ళతో , రెండు జడలతో , చామన చాయతో చాలా ఆకర్షణియంగా ఉండేది.  నా కంటే దాదాపు రెండు సంవత్సరాలు పెద్దదైన సుశీల నన్ను ఎప్పుడూ ఆటపట్టించేది   "ఏరా శ్యామ్ నన్నుచేసుకుంటావా?:" అని . నేను తెగ సిగ్గు పడి పోయే వాడిని .  అది చూసి  గల గల నవ్వేది. ఆ తర్వాత త్వరలోనే ఆ చిన్నతనంలోనే అమ్మాయికి వివాహం జరిగిపోయి  వెళ్ళిపోయింది. ఎందుకిలా జరిగింది? అసలు నాకు ఇచ్చి వివాహం చేస్తానని అన్నారు కదా !అని  కొన్నిసార్లు ఆలోచించాను. అంతకంటే ఎక్కువ ఆలోచన శక్తి ఆ వయసుకు లేదు కదా మరి!. కొన్ని సంవత్సరాల తర్వాత నేను కాలేజీ చదివే రోజుల్లో  సుశీల వాళ్ళింటి దగ్గర   ముగ్గురు పిల్లలతో కనిపించి నన్ను పలకరించింది "ఏం  శ్యామ్ బాగున్నావా ?అమ్మ నాన్న బాగున్నారా? అందరూ క్షేమమేనా ?" . నాకు చాలా సంతోషంగా తృప్తిగా అనిపించింది .  కాసేపు సంతోషంగా మాట్లాడి తిరిగి వచ్చేసాను. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు ?అని అనుకున్నాను. మరి  ఆ తర్వాత   యేలాంటి ఆలోచనలు రాలేదు.  అప్పటికే  నేను కాలేజీ చదువులు అనే  వేరే ప్రపంచం లోకి అడుగు పెట్టాను.
****************************************
ఆ  రోజుల్లో పిట్టలు కొట్టే కోయవాళ్ళు వచ్చేవారు. 
 వాళ్ల దగ్గర రబ్బర్  పట్టీలతో  తయారుచేసిన గులేరు(ఉన్డేలు) అనే  ఆయుధము ఉండేది. దాంట్లో చిన్న చిన్న రాళ్ళు పెట్టి గురి చూసి  పిట్టలను కొట్టే  వారు. ఆ   గులేరు తో  పిట్టలను  కొట్టడం  వాళ్లకు చాలా  నైపుణ్యం ఉండేది. అది చూపించి వాళ్ళు ఆ   గులేరు అమ్ముకునేవారు. నేనది కొనుక్కొని,  వారిలాగే పిట్టలను కొట్టడానికి తెగ   కృషి చేశాను. అబ్బే !ఎన్నిసార్లు కొట్టినా ఒక పిట్ట కు   కూడా రాయి తగిలింది కాదు, ఆ పిట్టచేతికి దొరికింది కాదు. మా ఇంటికి కాస్త దగ్గర్లో సిఎస్ఐ కాంపౌండ్ ఉండేది. అందులో విరివిగా పెద్దపెద్ద వృక్షాలు ఉండేవి .సాయం సమయం కాగానే దానిపైకి కొన్ని వందల పక్షులు వచ్చి చేరేవి.  ఇలా గుంపులోకి కొడితే ఒక్కటైనా పడుతుందేమో అని కూడా తెగ ట్రై చేశాను. కొట్టి కొట్టి రోజుల తరబడి అలసిపోయాను కానీ ఒక్క పిట్ట కు కూడా ఒక్క రాయి తగ్గలేదు, ఒకటీ కింద పడలేదు , పైగా డబ్బులు  తగల బెట్టానని మా ఇంట్లో ఒకటే తిట్లు.  బోయవాడు తను వాడిన గులేరు మంచిది, మాకు అంట కట్టిన  గులేరు దండగ అని అని నిర్ధారణకు వచ్చాను. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు గా.
***************************************
నేను   సుమారు గా 12 సంవత్సరాల  వయసున్నప్పుడు ,చలి కాలంలో మా ఇంటి ముందు నుంచి ఎడ్లబండ్ల లో చెరుకు తీసుకొని  చక్కెర ఫ్యాక్టరీ కి వెళ్ళేవారు. అవి సాధారణంగా మా ఇంటి ముందు నుంచి ఉదయాన్నే నాలుగు గంటలకు మంచి చలిలో వెళ్ళేవి. వాటి చక్రాల చప్పుడు  కిర్రు  కిర్రు  అంటూ   వినిపించేవి.  నేను నిద్ర లేచి ఆ  బండ్ల వెనకాతల    చప్పుడు చేయకుండా ,బండి వాడి కి కనిపించకుండా వెళ్లేవాడిని. వాళ్లకు తెలియకుండా జాగ్రత్త గా ఒక్కొక్క చెరుకు , మెల్లిమెల్లిగా గా   బండి లో నుండి బయటకు లాగి  ఒక్కొక్కటి రోడ్డు పక్కన పెట్టేవాడిని.  అలా కొద్ది దూరం వెళ్ళి సరిపోయినంత  చెరుకు గెడలు దొరికిన   తృప్తి కలిగిన తర్వాత , వెనక్కి వస్తూ వస్తూ ,ఆ రోడ్డు పక్కన వేసిన  చెరుకు గడలను    పోగు  వేసి , తీసుకొని ఇంటికి వచ్చేవాణ్ణి.  మరి ఆ రోజుకి ఒక మంచి పని చేశానని తృప్తిగా ఉండేది. ఇక కొన్ని రోజులు ఇంటి  డాబా  మీద   కూర్చుని చెరుకుగడలు నమలి దానిలోని రసం  పిలుస్తూ తింటూ ఉంటే కలిగే తృప్తి ఇంతా అంతా కాదు.  ఆ రోజుల్లో పిల్లలందరూ అదే పని చేసే వాళ్ళం.
 కొన్నిసార్లు బండి వాడికి దొరికి పోయి పరిగెత్తే వాళ్ళం.  పాపం , ఆ బండి  వాళ్ళు కొన్నిసార్లు మేము  అడిగితే  కూడా ఇచ్చేవారు.
***************************************
 మా ఇంటి ప్రక్కన అబ్రహం మామ అని  చిన్నపాటి టైలర్ ఉండేవాడు. దాదాపుగా అప్పటికే ఆయన వయసు 60 సంవత్సరాలు అయినప్పటికీ అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ ఉండేవాడు .రోడ్డు మీద కీ ఆయన కు చి న్న టైలర్ షాప్ ఉండేది. వర్షం పడ్డప్పుడల్లా జల్లు ఆయన షాప్ ను  తడిపేది. ప్రతి సంవత్సరం ఆ బాధలు పడి పడి ఆయన ఒకసారి తగిన డబ్బులు సమకూర్చుకొని ఆ వర్షపు జల్లుపడకుండా షాప్ ముందట రేకులతో ఒక షెడ్డు వేశారు. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ సంవత్సరం మరి వర్షాలు అసలే పడలేదు. షెడ్డు వేసుకొని డబ్బులు  దండగ అయ్యాయని ఆయన ఎప్పుడూ బాధపడేవాడు. అందరూ అనే వారు "ఈ అబ్రహం కు ఏమీ పని పాట లేదు. ఏ మంటూ వర్షం  జల్లు పడకుండా షెడ్    వేసాడొ కానీ  బాబు, అసలు వర్షాలు అన్నవి  లేకుండా  రాకుండా పోయాయి. రామ రామ. ".   అని.    మరుసటి సంవత్సరం వర్షాలు పడే వరకు అందరూ ఆయన ను   ఇలాగే అంటూ ఆట పట్టించారు. 
****************************************
ఈ సంఘటనలన్నీ నాకు ఈ మధ్యనే  జరిగినంత  తాజాగా,గుర్తుకు ఉన్నాయి.
 నాతో కలిసి గడ్డి వాము కాలబెట్టిన శ్యామ్ వివాహం చేసుకోకుండానే పెద్దవాడు అయిపోయాడు, కారణం ఏంటో ఎవరికీ తెలియదు. అప్పుడు నాతో ఆడుకున్న సుశీల, మనుమడు, మనుమరాల్లతో హాయిగా ఉంది. నేను కాలేజీ చదివే రోజుల్లోనే అబ్రహం మామ చనిపోయారు.  రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఆ మామ షాపు  పడగొట్టే సారు.
     
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం