చిట్టిపాప అలిగింది -బాల గేయం (మణిపూసలు):--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
చిట్టిపాప అలిగిందోయ్ 
బుంగమూతి పెట్టిందోయ్ 
గట్టి కారణం ఏదో 
సంగతిగా ఉందండోయ్ !

అమ్మ పిలిచినా వెళ్ళదు 
బామ్మ దగ్గరికీ పోదు 
మూలనిలబడే ఉంది 
కోపం చూపుల  వదలదు!

ఐస్ క్రీంలూ కావాలా 
పప్పు బెల్లం కావాలా? 
గుజ్జన గూళ్ల ఆటకూ 
బుడ్డీలే   కావాలా? 

ఉడుత పిల్ల కావాలట 
చిలక తోటి దోస్తీ అట
కోడి పిల్లలు అమ్మగా  
వస్తేమేo  కొనలేదట !


కామెంట్‌లు