ఐకమత్యం:-సత్యవాణి కాకినాడ

 అడవిలోన చెట్టు పైన
అందమైన పావురాలు
వందలాదివసియించెను
చెలిమితోడ ఒకరి కొకరు
ఆహారపు వేటలోన
అవి కాంచెను నూకలను
ఆనందం అమిత మాయె
ఆశ కూడ మెండాయెను
దేవుడెంత దయామయుడు
దక్కెమనకు నూకలని
వారించెను వారి తాత
వద్దు సుమా వెళ్ళొద్దని
మనుషులు మసలనిచోట
మనకిక్కడ నూకలేల
వద్దు ఆశ కూడదనెను
కాళ్ళదగ్గరున్న కూడు
కాలదన్నుకొననేల
తాతమాట విననేల
కాలదన్న మేలౌనా
అనిఅనుచును
పక్షులన్ని ఆశతోడ
నేల వ్రాలె
వాలినంత వలలోపల
పక్షులన్ని పడి పోయెను
నీదు మాట చెవి పెట్టక
చెడిపోతిమి మేమనచు
గోడు గోడునాపక్షులు
ఘొల్లుమనెను తాతతోడ
అనుభవాల ఆతాతా
ఆలోచించెను బాగా
తట్టినట్టి ఉపాయమును
తెలిపెను పక్షులకతడు
ఒకటి రెండు మూడు అందు
అందరు ఒకమారు లెండు
ఆకశ మార్గము పట్టి
అందరు ఒక్కమారు పొండి
అనిచెప్పెను తాత అంత
తాత లెఖ్ఖ విన్నంతనె
తప్పించుకు పోయెనవి
వేటగాడు వగచెనెంతొ
వలకూడా పోయెనని
ఒౌరా ఈ పక్షిజాతి
ఐకమత్యమెంతొగదా
మానవులలో లేనట్టిది
ఖగములలో మెండుందని
ముచ్చటపడి వేటకాడు
మును ముందుకు సాగినాడు
                     
కామెంట్‌లు