*విష్ణు ప్రీతి అయిన, ప్రశస్తమైన వైశాఖ మాసం....*
*శివ స్వరూపమైన అది గురువు, ఆదిశంకరులు అవతరించిన మాసం.....*
*వేంకటేశ్వరుని ఇలవేల్పు గా చూసుకుంటూ, శివాభిషేకంలో తన ఉన్నతిని, ఉద్ధతిని పొందిన మా తండ్రి గారు వైశాఖ శుద్ధ పంచమి తిథిన వచ్చిన మాసం....*
*"శ్రీకాళహస్తీశ్వర శతకం" తో మీ ముందుకు*
*నేల మీద ఉద్భవించిన అపర శివభక్తుడు "ధూర్జటి కవి" గురించి, ఆయన రెండు రచనలలో, రెండవది అయిన "శ్రీకాళహస్తీశ్వర శతకం" ను మీతో పంచుకోవడానికి, ఇంతకంటే మంచి సందర్భం వుండదేమో అని, చిన్ని ప్రయత్నం చేద్దాము అని పరమేశ్వర సంకల్పంగా నాకు తోచింది. నా ఈ సాహసానికి మీ అనుమతి వుంటుంది అని ఆశిస్తూ... కోరుకుంటూ....*
*"ధూర్జటి కవి" మొదటి రచన "శ్రీకాళహస్తి మాహాత్మ్యం". ధూర్జటి కవి పరమ శివభక్తుడు అయిన శైవ రూపం*
*శార్దూల, మత్తేభాల పద్య పద్ధతిలో సాగిన ఈ శతక రచనలో అపారమైన భక్తి భావం ధారాళంగా కనిపిస్తుంది.*
*మన చరిత్రలో ఎంతో మంది స్త్రీ లోలులైన మనుషులు, తరువాత యదార్ధం గ్రహించిన వారిలా, శ్రీ కృష్ణ దేవరాయలు తరువాత పాలించిన రాజుల వల్ల పడ్డ కష్టాలు అనుభవించి కూడా, ఏ మహీపతికీ తన కృతులు ఇవ్వక, భక్తిపరుడై, తన శివ భక్తి చూపుతూ, మహాద్భుతమైన "శ్రీకాళహస్తీశ్వర శతకం "ను మనకందించారు, "ధూర్జటి కవి".*
*పరమేశ్వర ఆత్మబంధువులమైన మనమందరం, తెలుగు భాష మీద వున్న ప్రేమను, అభిమానాన్ని మన తరువాత వారైన చిరంజీవులకు పరిచయం చేస్తూ, మనదైన శతక సంపదను వారికి పరిచయం చేసి, రోజుకు ఒక పద్యం చిన్నారులకు నేర్పించే ప్రయత్నం అందరూ చేయగలరని ప్రార్థిస్తూ.... చేస్తారని ఆశిస్తూ.... ఎప్పటిలాగే నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని, అలా పరమేశ్వరుడు అనుగ్రహించాలని వేడుకుంటూ....*
... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి