ఇదేరా ! అమ్మ మనసు:-పెదపాటి పద్మగోవింద్--నర్సీపట్నం.

 వాణి మొన్ననే బాబు హాస్టల్ కి ఫోన్ చేసింది 
ఏమండీ బాబుతో మాట్లాడిస్తారా ! హాస్టల్ వార్డెన్ విసుగ్గా ఏం మాట్లాతారండి! ఇలా పేరెంట్స్ 
పిల్లల్ని డిస్టర్బ్ చెయ్య కూడదండి. సారి ! అండీ ఫోన్ కలపలేం. చిన్నపుచ్చుకుంది వాణి.
రెండురోజులు తరువాత స్కూల్ నుండి మెసేజ్. అమ్మా ! పేపర్లో ప్రచురింనచిన మీ కవిత “ఇదేరా ! అమ్మ మనసు” మేము చదవదం జరిగింది. హాస్టల్ లో పిల్లల్ని పెట్టె మాత్రుమూర్తుల ఆవేదన కనిపించింది. మమ్మల్ని కదిలించింది.
ఈ కరోనా నేపద్యంలో, పిల్లలు శ్రేయస్సు  దృష్ట్యా విసిటింగ్లు తగించాము. వెసులుబాటుగా తల్లిదండ్రులు వారి పిల్లలతో వీడియో కాల్స్ ద్వారా 5 నిమషాలు మేరకు మాట్లాడుకునే అవకాశం కల్పించతలచుకున్నాం. వాణి కంటనీరు పెట్టుకున్నది. వెంటనే తన స్నేహితురాలు  వర్ధనీ విషయం చెప్పింది. అయితే వాణీ నీకు ఇది చిన్నపాటి గెలుపు. అంటే మన అమ్మల గెలుపు. వాణీ నువ్వు రాసిన కవిత నాకు వాట్సాప్ చెయ్యు. సరే వర్దిని. 
నీ జ్ఞాపకాలు పరుగులు 
నన్ను తరుముకొస్తుంటె
నీకు పెట్టిన గోరు ముద్దలు, ముద్దలు  గురుతుకోస్తుంటే
హద్దులేని నా ధుక్కాన్ని ఎలా వర్నించనుకన్నా!
నీరాక నాకు రాక రాక వచ్చే ఏరువాక
 తిరిగి నీ పోక 
నా మనసు అడ్డుకున్న 
మింగుడు పడని ఒక పోక చేక్కయేకదా!
తిరిగి నీ గురించి ఆశను, ఆర్తిని
నింపుకున్న ఎదురుచూపులు
నిన్ను కలసినప్పుడు నీవు కార్చిన కంటనీరు 
నీ కంట నుండి రాలేదు కన్నా!
నా మనసు నుండి విలవిలలాడి వచ్చినవే!
చెమ్మగిల్లిన మనసంతా తడియైన  వేళ
ఆది ఆరని అమ్మతనమా
లేక చేమ్మతనమా ఏమో!
నా కంటె నిండ మెదిలే నీ జ్ఞాపకాలు
నేకంట నీరు కరిస్తే 
ఆ జల్లున జాలు వారి పోతాయేమోనని
కంటనీరు జారాన్ని దాచిన నాకన్నులు
మసకబారి నీరాక కానరాక పోతానేమో!
అనుక్షణం నీ చిలిపిచేస్టలు గురుతుకోస్తుంటే,
చేష్టలుడిగి మిగిలాను కన్నా!
నువ్వు వస్తావని తెలిసినా,
వెళ్ళడానికే వస్తున్నావని తెలిసి 
ఆ ఆనందం ఆవిరైపోతున్నది కన్నా
నీరాక నాకు వరం అయినా ఏదో కలవరం.
ఎందుకంటే నీ పోకతో ఆ వరం కలగా మిగిలిపోతుంది
నీరాక పోకలతో మనసంత కలకలంగా,
కకావికలంగా వున్నా, 
నువ్వు మాత్రం నా అనుభవాలకు ఆహితంగా 
నా ఆయుషు నీదిగా చేసుకొని 
చిరకాం చిరంజీవిగా వర్దేల్లుకన్నా!
ఇదేరా! ఆమ్మ మనసు .........

కామెంట్‌లు