నగలు తింటూ... బెల్లం నంజుకుంటూ.... (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

         ఒక గుడ్డి గద్ద  ఉండేది.
        అది కుడుములు వండుకోవాలి అనుకుంది. 
       ఇంట్లో బెల్లం లేదు. 
       బెల్లం తెమ్మని పక్కింటి కాకిని పంపింది. 
       కాకి శెట్టి  కొట్టుకు పోయింది. 
       బెల్లం కొన్నది. 
       కొసరు పెట్టమని శెట్టిని అడిగింది.
       శెట్టి కొంచెం బెల్లం పెట్టాడు. 
       వస్తూ వస్తూ శనగ చేలోకి వెళ్ళింది. 
       శనగలు ఏరుకుంది.
       శనగలు తింటూ... బెల్లం నంజుకుంటూ.. నింపాదికగా ఇల్లు చేరింది.
       బెల్లం పొట్లం చేలోనే మర్చిపోయింది. 
       గద్ద కాకి ముక్కును వాసన చూసింది.  
       బెల్లమంతా కాకే తిన్నదనుకుంది. 
       ఎగిరెగిరి కాకిని తన్నింది. 
       గద్ద గుద్దులకు కాకికి బెల్లం పొట్లం మర్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చింది. 
       పరుగు పరుగునా పొలం పోయింది. 
       పొట్లం తెచ్చి గద్దకు ఇచ్చింది.
       తొందరపాటుకు గద్ద బాధ పడింది.
       “ఏ పనినైనా వెంటనే చేయాలి. 
       పని ముగిసిన తర్వాతే ఇంకో పనికి పూనుకోవాలి" అని కాకి తెలుసుకుంది. 
       గద్ద బెల్లం కుడుములు వండింది.
       కావలసినన్ని కాకికి పెట్టింది. 
       తన్నుల తిన్న కాకి కడుపునిండా తిన్నది.
కామెంట్‌లు