పల్లె ఘొల్లుమంటోంది:--కుంటముక్కుల సత్యవాణి-(కాకినాడ)

 పల్లెలు చిన్నబోతున్నాయి
పల్లెపదాలు వినబడక, వినేవారు లేక
పల్లె అరుగులు చిన్నబోతున్నాయి.
పండితుల సాహిత్య చర్చలు లేక
పల్లె నట్టిళ్లు చిన్నబోతున్నాయి.
చింత గింజలు ఆడే చెలియలు లేక
పల్లె వీధులు చిన్నబోతున్నాయి
దాగుడుమూతలాడే చిన్నారులు లేక
పల్లె నూతులు పూడిపోతున్నాయి
కడవలు నెత్తిన మోసే తరుణులు లేక
పల్లె కమతములు మూతబడుతున్నాయి
కాడి పట్టి దున్నే రైతు లేక
 పల్లె చెరువులు పసరు పడుతున్నాయి
త్రాగడానికి ఆలమందలు లేక
పల్లె బడులు మూతబడుతున్నాయి
బలిసినవారి బడి బస్సులు పల్లెలలోని 
పిల్లలను వేటాడి తీసికొని  
పల్లెల్లో పలకరింపులు పాతబడిపోయాయి
టీవీ సీరియల్స్ చూడటంలోమునిగి  జనాలు పలుకరించేవారు లేక
పల్లెటూరు మొల్లుమంటోంది.
పట్టుమని పది నిమిషాలు పనిచేసే స్త్రీ పురుషులు లేక
పనిసంస్కృతి మరుగునపడిపోయి
పల్లెజనం పరుగులు పెడుతున్నారు
పట్టణాలపై వ్యామోహం పెచ్చుపెరిగి


కామెంట్‌లు