చికు బుకు రైలు :-ఎం. వి. ఉమాదేవి
చికు బుకు రైలువచ్చె చికాకులే తొలగించె 
ప్రయాణము వేగముగా ప్రజలంత సంతసించె 

కూ మంటు వస్తుంది కూరిమినె యిస్తుంది 
రా అంటు యెక్కమని రమ్యంగా అడుగును 

రక రకాల మనుషులు రద్దీగా ఉన్ననూ 
సర్దుకొని ఉంటారు సరదాగ మెలుగుతూ

సమోసాలు పూలనూ  సకలమూ నమ్ముబడు 
జీవితము రైలుగా జిలుగువెలుగు యానము!


కామెంట్‌లు