ఏకపది:
*******
1.లోకమంతా ప్రణయమే .......
ఆస్వాదించే మనసుంటే..!!
2.భాషలేని భావమే......
సుమధుర ప్రణయము..!!
ద్విపది:
*******
1.ప్రేమగా పలకరించి చూడోసారి!
శత్రువు కూడా మిత్రుడవుతాడు!
2.విశ్వమంతా నిండినది ప్రేమ!
సృష్టి రహస్యమే ప్రేమ!!
త్రిపది:
******
1.కులమతాలకు అతీతమై...
సంకుచితభావాలను
తుడిచిపెట్టే ప్రేమ...
విశ్వవిజేతయై నిలబడుతుంది.
2.కసిరి,కొసరే ప్రేమ......
శైశవం నుండి వృద్ధాప్యం దాకా వెంటనంటి..
మరణం వరకు కొనసాగుతూనే ఉంటుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి