మీరు చెబుతారా ?నన్నే చెప్పమంటారా ? - బెల్లంకొండ నాగేశ్వర రావు

 అమరావతి నగర పోలిమేరలలోని అడవిలో నీటి ఏద్ధడి రావటంతో అడవిలోని జంతువులని కృష్ణా నది తీరప్రాంతం అయిన అడవికి తరలి వేళసాగాయి.”ఏనుగు అన్న దరి పొడుగునా మనం ఏదో ఒక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే ప్రయాణ అలసట తెలియదు అందుకని నువ్వు మ అందరికి ఏదైనా నీతి కధ కని యుక్తి కధ కని చెప్పు” అన్నాడు నక్క బావ .
“అవును మామ మా అందరిలో పెద్ధవాడివి అనుభావసాలివి ,నీ అనుభవాలు మాకు ఓ మంచి కధ చెపు అన్నాడు కోతి బావా.”
“ ఓహో ఏనుగు తాత కధ చెప్తునాడు అందరు రండి “ అన్ని పెద్ధగా ఓoడ్ర పెట్టాడు గాడిద అన్న “.
ఓ పెద్ధ మర్రి చేటు కింద ఉన్న ప్రదేశంలో జంతువులని సమావేశం అయ్యాయి .సరే వినండి మీ అందరికి కొంత విశ్రాంతి లబించేల కోద్దిసేపు ఆగుదాం ,నేను చెప్పే యుక్తి కధ జాగ్రతగా వినండి .
మన అమరావతి నగరంలో రాఘవయ్య ,సుబ్బయ్య అనే దంపతులు నివసించేవాళ్ళు.సుబ్బమ్మ పడి పశువులతో పాల వ్యాపారం చేస్తుంటే తాము పెంచుకున్న కోళ్ళ గుడ్లను ప్రతి ఆదివారం నగరం లోని సంతలో అమ్మి వచ్చేవాడు రాఘవయ్య.ఎప్పట్టిలా ఓ ఆదివారం బుట్టలో కోడిగుడ్లు తెసుకొని బయల దేరి రోడ్డు పక్కగా నడుస్తున సమయంలో బస్సును తప్పిoచబోయిన ఓ కారు వాడు రాఘవయ్యను డీ కొట్టాడు చిన్నగా,గాయాలు ఏమి కనపటికి అతని తలపై ఉన్న బుట్ట నేలపై పడటంతో దానిలోని కోడిగుడ్డ్లు అన్ని పగలిపోయాయి . కారు నడుపుతున వ్యక్తి రాఘవయ్య వద్దకు వచ్చి “మనించండి నా వలన మీకు జరిగిన నష్టం ఎంతో తెలియజేస్తే అంత ధనం నేను ఇస్తాను “అన్నాడు .
“ సరే బాబు ఈ కోడిగుడ్లు వెల రెండు బాగాలు చేస్తే ఒకటి మిగులుతుంది ,మూడు భాగాలు చేస్తే రెండు మిగులుతుంది ,నలుగు భాగాలూ చేస్తే మూడు మిగులుతుంది ,అయిదు భాగాలూ చేస్తే నలుగు మిగులుతుంది ,ఆరు భాగాలూ చేస్తే అయిదు మిగులుతుంది ,ఏడు భాగాలూ చేస్తే సమంగా సరిపోతుంది “అని అన్నడు రాఘవయ్య .
“క్షణ కలం ఆలోచించిన అ కారు వ్యక్తి ఇదిగో మరో రూపాయ్ అదనంగా తేసుకో అంటూ కోడిగుడ్ల వెల చెలించి వెళ్ళిపోయాడు .
మిలో ఎవరైనా కారు లో వచ్చిన వ్యక్తి రాఘవయ్య కు ఎంత ధనం చెల్లిoచాడో చెప్పగలరా” అని అన్నాడు ఏనుగు తాత .
“రాఘవయ్య బాబాయ్ చిరునామా సరిగ్గా చెప్తే నేను వెళ్లి సాయంత్రానికి తెరిగివచ్చి సరైన సమాధానం చెప్తాను అంది పిల్ల రామచిలక .
దాని అతి తెలివి మాటలకు నవ్వుకున్నాయి జంతువులన్ని “.తాత జంతువులకు ఆలోచన శక్తీ లేదు అందుకని మేము సమాధానం చెప్పలేము కనుక నువ్వే చెప్పాలి “అన్నాడు కోతి బావ .
సరే అన్న ఏనుగు తాత సమాధానం చెప్పాడు .
బాలలు ఏమిటి సమధానం కోసం వెతుకుతున్నారా మీరు ప్రయాత్నించి చూడండి.తెలుసుకోలేకపోతే.....మి చేతిలోని ఈ దినపత్రికను శిర్శసనం వేయించండి సమాధానం కనిపిస్తుంది ......
సమాధానం
కోడికుడ్ల వెల 119 రూపాయలు అదనంగా కారు నడిపే వ్యక్తి ఇచ్చినది 1 రూపాయి.. మొత్తం 120

కామెంట్‌లు