అమృత మూర్తి కి,కుసుమాంజలి ...!!*:- --డా.కె .ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ.
అమ్మ లు 
అనేక రకాలు 
అయినా ...
అమ్మ ..అమ్మే !
అమ్మ స్థానానికి 
మరో __
ప్రత్యమ్నాయం లేదు ,
అందుకే ...
అమ్మపాత్ర 
అనిర్వచనీయం !

కొందరు అమ్మలు 
కొడుకులను ,
అదికంగా _
ప్రేమిస్తారు ,
కొందరు అమ్మలు 
కూతుళ్లను ,
ఊహించనంతగా ,
ప్రేమిస్తారు ,
ఎక్కువశాతం తల్లులు 
కొడుకులను _కూతుళ్లను 
సమాన నిష్పత్తిలో ,
ప్రేమగా పెంచుతారు !

మా ..అమ్మ ,
మూడోరకం తల్లిగా ,
అందరినీ _
సమానంగా పెంచింది ,
తల్లిగా __
ప్రేమను పంచింది 
సంతానం 
పురోభివృద్ధికి ,
క్రొవ్వొత్తిలా _
కరిగిపోయింది !

అక్షరాస్యత 
లేకుంటేనేమి ....
అపారమైన తెలివితో 
ఒక సాదారణ కుటుంబాన్ని ,
సంపన్నుల కుటుంబంగా 
తీర్చిదిద్దింది ....!

అమ్మకు ...
అత్యాశలు లేవు ,
ఆమె కోర్కెలన్నీ 
పిల్లల అభివృధ్దిమీదే ,
అది కొసవూపిరివరకూ 
సాగిపోయింది ..
అనుకున్నది _
సాధించింది ,
విజయఢంకా 
మ్రోగించింది .....!

అదృష్టం ...
అందరికి కలిసిరాదు ,
అదిమా అమ్మ _
దరికి రాలేదు ....
సుఖాన్ని __
అనుభవించే సమయానికి ,
పిల్ల ల ....
అంచెలంచెల _
అభివృద్దిని చూడకుండానే ,
తానెవరికీ ....
భారంకాకూడదని ,
అనంతలోకాలకు 
హాయీగా _
ఎగిరిపోయింది ...
మమ్ములను _
దుఃఖ సాగరంలో 
ముంచేసింది ....!

అమ్మ త్యాగం 
మరువరానిది !
అమ్మజీవితం _
వెలకట్టలేనంత ,
త్యాగమయం  
అమ్మలున్న వారి జీవితం 
కొలమానం అక్కరలేని ,
ఆనంద సాగరం ...!!


కామెంట్‌లు