*శ్రమ విలువ-కథ*:-:--దుగ్గి గాయత్రి:-టి.జి.టి.తెలుగు,కల్వకుర్తి,-నాగర్ కర్నూల్,తెలంగాణ.


 గోపాలపురంలో నందన్,దేవి దంపతులు ఉండేవారు.వారు సంపన్నులే కాక సమాజ సేవలో కూడా ముందుండేవారు.వారి ఒక్కగానొక్క కొడుకు వర్ధన్.ఎంతో గారాబంగా పెరిగాడు.బాగా అల్లరి పిల్లవాడు.డబ్బుల విలువ,వస్తువుల విలువ,శ్రమ విలువ తెలవకుండా పెరిగాడు.ఎంత విలువైన బట్టలైన, వస్తువులైనా కొన్ని సార్లే వాడి పారేసేవాడు.వర్ధన్ ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు.అతనికి అన్నిటి విలువ తెలియచేయాలని,మనం తినే అన్నం నుంచీ కట్టుకునే దుస్తులు,ఇంకా వాడుకునే ప్రతీ వస్తువు తయారు వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉందని తెలపటానికి ఎంతో ప్రయత్నించేవారు.కానీ ఫలితం లేక పోయింది.అనుకోకుండా ఒకరోజు వర్ధన్ మామయ్య వర్ధన్ వాళ్ళింటికి వస్తాడు.పిల్లాడి ప్రవర్తనకు తల్లడిల్లుతున్న అక్కాబావల పరిస్థితి చూసి తన వెంట వర్ధన్ ని ఊరికి పంపమంటాడు.సరే అని నందన్, దేవి లు వర్ధన్ ని ఊరికి పంపిస్తారు.వర్ధన్  వాళ్ళ మామయ్య తమ ఊరిలోని శ్రామికులు మరియు కులవృత్తులు చేసుకొనే వాళ్ళ స్నేహితుల ఇళ్లకు తీసుకొనిపోతూ వాళ్ళేవిధంగా వస్తువుల తయారీలో కష్ట పడుతున్నారో ,ప్రత్యక్షంగా వారి కష్ట సుఖాలను,వారి యొక్క శ్రమను సమాజానికి ఏ విధంగా ధారపోస్తున్నారో తెలియపరచటం తో వర్ధన్ తాను ఇన్నాళ్లు ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధ పడతాడు.శ్రమ,ప్రేమ,డబ్బు విలువను తెలుసుకొని తండ్రిని మించిన తనయుడిగా పేరొందుతాడు.


కామెంట్‌లు