జయం మనదే ..!!:-డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హన్మకొండ .

 నువ్వూ -నేనూ 
మనసుపడి ...
ఒకరిహృదయాల్లోకి 
మరొకరం చొరబడి 
ప్రేమపురాణాలు 
పుక్కిట పట్టేసాం!
కల్యాణఘడియకోసం 
వెయ్యికళ్లతో 
ఎదురుచూస్తున్న 
సమయాన్ని ...
కరోనా కట్టడిచేసింది !
కులమతాలు -
జయించిన మనకు ...
ఈ కరోనా  ఎంత ..?

కామెంట్‌లు