*నాయాళ్ళు!*:-డా. పి.వి.ఎల్.సు‌బ్బారావు

1.జోళ్ళు కుట్టేవాళ్ళు!
   రోకళ్ళు దంచేవాళ్ళు!
   దుక్కి దున్నేవాళ్ళు!
   పంట నూర్చేవాళ్ళు!
   బళ్ళు తోలేవాళ్ళు!
2.కాలువలకల్మషం తీసేవాళ్ళు!
 రహదారుల చెత్త ఊడ్చేవాళ్ళు!
 బట్టలమురికి పోగొట్టేవాళ్ళు!
 పెరిగినజుట్టు కత్తిరించేవాళ్ళు!
 శుభ్రంగా అంట్లు తోమేవాళ్శు!
3.నీవు మంచాన పడితే!
    ఒళ్ళు పట్టేవాళ్ళు
    పళ్ళు కడిగేవాళ్ళు!
 అసహ్యం లేక ఆదరించేవాళ్ళు!
 బహిష్కరించక ఆదకున్నోళ్ళు!
పోతే,పూడ్చడానికివచ్చేవాళ్ళు!
వెంట ఉండి సాగనంపేవాళ్ళు!
4.సమాజాన అధోస్థాయైనా,
పనిలో ఉన్నతస్థాయి ఉన్నోళ్ళే,
 నాణ్యమైన నాయాళ్ళు!
  పనితనానికి ఆనవాళ్ళు!
 సంఘానికి కావల్సినోళ్ళు!
5.ఉన్నతస్థాయిలో ఉన్నోళ్ళు!
   నీతికి నీళ్ళొదిలినవాళ్ళు!
  నీచాతినీచంగాబతికేవాళ్శు!
   నిజంగా దొంగనాయాళ్ళు!
 తల్లుల కడుపున చెడపుట్టిన,
       చెదపురుగులు వాళ్ళు!
6. *జన్మ* సమానం!
    *కర్మ* కొలమానం!
    *స్థాయి* నిర్ణయం అదే!
    తక్కువ నాయాళ్ళే!
    జాతికి ఎక్కువ న్యాయం,
                చే‌స్తునవాళ్ళు!

కామెంట్‌లు