అవ్వ చేతి వంట (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
బీరయ్య తాత వచ్చాడు
బీర గింజలు తెచ్చాడు
మట్టి తవ్వి పెట్టాడు
పందిరి వేసి పెంచాడు

బీర తీగ పారింది
పందిరి పైకి ఎక్కింది
మొగ్గ లేసి పూసింది
పిందె లేసి కాసింది

బీరకాయలు పెరిగాయి
అవ్వా చూసి తెంపింది
ఎసులలో కూర వొండింది
తాతను అవ్వ పిలిచింది

కంచాలు కడిగి తెచ్చింది
కూర బువ్వ పెట్టింది
కమ్మగ మేము తిన్నాము
కలిసిమెలిసి ఉన్నాము


కామెంట్‌లు