షాడోలు (జీసస్ -బాల గేయం):---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

మంచిని చెప్పెను 
చెడునే  విప్పెను 
శిలువను  ఎక్కెను 
కరుణామయుని చరిత్ర ఉమా!

పశువుల పాకను 
శిశిరము చివరను 
శిశువుగ  వెలసెను 
జ్ఞానులు తారను చూసెఉమా!

వడ్రంగి కొడుకు 
మనసంత దుడుకు 
జనమంత వెదుకు 
ధనికుల క్రూరత  నాపె ఉమా!

దీనులు పేదలు 
చాచిరి చేతులు 
చేపలు రొట్టెలు 
పంచెను దోస్తుల చేత ఉమా!

అసత్య నేరము 
మోపిన ఘోరము 
హెరోదు వైనము 
తీర్పున శిలువగ వ్రాసె ఉమా!

ఘొల్లుమన మేరి 
శిలువన కలవరి 
నేస్తులు ఏడ్చిరి 
ముళ్ల కిరీటము పెట్టె ఉమా!

చిందిన రుధిరము 
కడిగెను పాపము 
క్రీస్తు చరిత్రము 
జెరూసలేమున ముగిసి ఉమా!

శాంతి పావురము  
క్రాంతి దర్శనము 
జీసెస్ మార్గము 
విశ్వ వ్యాప్తమైనది ఉమా!


కామెంట్‌లు