ప్రేమ(వచనకవిత):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 ప్రేమ ఇంకా ఉంది కనుకనే
స్నేహం అమృతమే అయింది
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
దాంపత్యం సజీవమై నిలుస్తున్నది
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
సరిహద్దులు చెరిగిపోతున్నాయి
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
బంధాలు నిలబడుతున్నాయి
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
స్నేహం అమృతమే అయింది
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
దాంపత్యం సజీవమై నిలుస్తున్నది
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
అశాశ్వతాలు శాశ్వతాలవుతున్నాయి
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
పరిమళాలు గుభాళిస్తున్నాయి
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
మానవత్వం చిరునామా అవుతుంది
ప్రేమ ఇంకా ఉంది కనుకనే
ధాత్రి దయామయం అవుతుంటుంది.
కామెంట్‌లు