"మృత్యుభయం":--చైతన్య భారతి పోతుల-హైదరాబాద్-చరవాణి:7013264464

  వీరయ్య ఒకపెద్దరాజ్యంలో పేరు మోసిన దొంగ.రాత్రి కాగానే ఎవరింట్ల దూరి దొంగతనం చేద్దామా..! ఎవరిని దారి దోపిడీ చేద్దామా..! అని ఆలోచిస్తూ ఉంటాడు.అలా దొంగతనం,దారిదోపిడీ చేసి భార్య మెడనిండా బంగారం, పెద్ద ఇల్లు జమ చేసుకున్నాడు.నలుగురు పిల్లలకు ఏ లోటూ లేకుండా పెంచుతున్నాడు. పగలంతా నిద్రపోతూ రాత్రిపూట దొంగతనాలు చేసే రంగయ్య రాజుకు ఎప్పుడూ చిక్కకుండా తెలివిగా మసలుకుంటున్నాడు.పిల్లలకు మాత్రం రాజు దగ్గర పెద్ద కొలువు ,అది రాత్రిళ్ళు చేసే డ్యూటీ అని చెప్పేవాడు.
     ఇంతలా దొంగతనాలు చేస్తున్నందుకు ఏ రోజైనా రాజు చేతిలో చిక్కితే మరణ శిక్ష తప్పదని..పెళ్ళాం,పిల్లలగతి ఏమవుతుందోననీ వృద్ధురాలైన తల్లి బాధపడుతూ ఉండేది.దొంగతనాలు మాని ఏదైనా పని చేసుకోమని హిత బోధ చేస్తూ ఉండేది.పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.వారు కూడా దారితప్పే ప్రమాదం ఉందని ఎంత చెప్పినా పెడచెవిన పెట్టేవాడు.
      రోజూలాగే దొంగతనానికి వెళ్లిన వీరయ్యకు ఆ రోజు ఒక్కదొంగతం,దారిదోపిడీ ఒక్కటి కూడా దొరకలేదు.అలసిపోయి ఇంటికొచ్చి బాగా నిద్రపోయాడు.
     ఒకరోజు బాగా జ్వరం వచ్చి రంగయ్య ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు పరీక్షించి తనకు తీవ్రమైన పెద్ద జబ్బు వచ్చిందనీ..,అది చాలా ముదిరిపోయిందనీ. ,తాము ఏమి చేయలేమనీ..చెప్పారు.పదిరోజులకంటే ఎక్కువగా బతకలేడని చెప్తారు.అప్పటి నుండీ వీరయ్య దిగాలుగా ఉంటున్నాడు. ఎప్పుడూ మరణం గురించే ఆలోచిస్తూ వణికి పోతూ ఒంటరిగా ఊరి బయట చెట్టుకిందా కూర్చున్నాడు.ఒక ముని ఎదురవగా తన పరిస్థితి అంతా చెప్పుకొని బాధపడ్డాడు. తాను ఇన్నిరోజులు చేసిన తప్పును తలచుకొని కుమిలిపోయాడు.చావు భయంతో నిద్ర పట్టక రోజురోజుకు మృత్యుఒడిలోకి చేరువవుతూ నీరసించిపోయాడు.తొమ్మిది రోజులు గడిచిపోయి,తన చావుకు ఇంకా ఒక్కరోజే మిగిలింది.
   ఆ ముని మళ్లీ ఎదురై "ఈ తొమ్మిది రోజులు ఏమైనా దొంగతనాలు చేసావా.."?అని అడుగుతాడు. లేదని తలూపాడు.మరి ఏమి ఆలోచించావని అడుగగా రోజు రోజుకు చావు దగ్గరవుతుంటే విలువైన జీవితాన్ని,కాలాన్ని చెడ్డపనులతో వృధా చేసుకున్నాననీ చావు ఆలోచన తప్ప,మరే ఆలోచన రాలేదు అని,తనను మృత్యువు నుండి రక్షించమని,ఇంకెప్పుడూ ఇలాంటి చెడు పనులు చేయననీ గట్టిగా ఏడుస్తాడు.
       నిద్రాభంగం అయి అందరూ లేస్తారు.ఆ అరుపులు,ఏడుపూ విని,భార్యా తల్లీ ఏమైందనీ, ఎందుకలా పలవరిస్తున్నవానీ..పీడకలలు ఏమైనా వచ్చాయా..బాబూ..అని తల్లి అడిగితే విషయమంతా చెప్పి ఏడుస్తాడు.
"బాధపడకు నాయనా..! నువ్విప్పుడు సరైన దారికొచ్చావు.ఇకముందు ఇదే ద్యేయంతో ముందుకెళ్లు..నిద్రలో నీకు వచ్చిన కల మంచిదే.నీ గురించి నేను రోజూ భగవoతున్ని ప్రార్థిస్తున్నాను.ఇంకెప్పుడూ దొంగతనం ,దోపిడీల జోలికి వెళ్లనని,ఈ పాపపు పనినుండీ బయట పడేయమని దేవుణ్ణి వేడుకో.. నీకు ఏ జబ్బూ చేయలేదు.కలలో నీకు భగవంతుడు హెచ్చరిక చేసాడు..అని "తల్లి చెప్పగా వీరయ్య తల్లి పాదాలకు మొక్కి బుద్దిగా ఉంటానని మాటిచ్చాడు. వీరయ్య భార్యా పిల్లలు చాలా సంతోషించారు. తర్వాత కిరాణం కొట్టు పెట్టుకొని కుటుంబంతో హాయిగా ఉన్నాడు.
       ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చనిపోవలసిందే. ఆ చావు తనకు దగ్గరగా వచ్చిందంటే నఖశిఖపర్యంతం ఒణికిపోతాడు.అయినా మనిషి ఆ చావును మరిచిపోయి రోజూ ఏవేవో తప్పులు చేస్తూ ఉంటాడు.అబద్దాలతో, మోసంతో త్వరగా ధనవంతుడు కావాలని తప్పుడు మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడు.
     జీవికి చావు అనివార్యం.అది ఎప్పుడైనా రావొచ్చు.ఏ కారణంగానైనా రావొచ్చు.కానీ మనిషి బ్రతికి ఉన్నంతకాలం మంచి ఆలోచనలు, మంచిపనులతో ,మంచి మార్గంలో పయనిస్తే అతనికి చావుభయం ఉండదు.వ్యక్తి మరణించినా జీవించినట్లే.