*మా నాన్న పాఠశాల* :-" కావ్యసుధ "(ఆర్. హరి శంకర్ )9247313488.హైదరాబాద్.

 ధనం ముఖ్యం కాదు
ధర్మాన్ని పాటించి 
ధర్మాన్ని ఆచరించు
నీతి నిజాయితీగా బ్రతుకు
ఆదైవం ఇస్తుంది నీకు మెతుకు
మా నాన్న
నీతి బోధలు చేసినాడు
నిజాయితీగా బ్రతికినాడు
అందుకే కదా మా నాన్న
మేడలు మిద్దెలు కట్టలేదు
ఆస్తులను కూడా పెట్టలేదు
కష్టాలు ఎన్నో భరించాడు
ఏ లోటు లేకుండా
మమ్ము పెంచాడు
ఎనిమిది మంది సంతానం
ఆర్గరు మగ, ఇద్దరు ఆడ
మా నాన్న సంపాదించిన ధనం
మేము తీర్చుకోలేని ఋణం.
ఎవరి స్వశక్తితో వారు
సంపాదించుకుంటే
జీవితం విలువ తెలుస్తుందని
కష్టసుఖాలు తెలుస్తాయని
మా నాన్న నేర్పిన పాఠం.
చివరి రోజుల్లో మా నాన్న
తన తలగడ కింద దాచుకున్న
తెల్ల కాగితపు ముక్కలను
ధనంగా భావించాడో ఏమో
తన రుణం తీరిపోద్ది అని
మా అందరినీ పిలిచి
సమానంగా పంచుకోమన్నాడు 
అమాయకపు మా నాన్న
మనసుకు మా కన్నీటి తర్పణం
మనం ఈ  సమాజములో
నిత్యం చూస్తూనే ఉన్నాం !
తల్లిదండ్రుల ఆస్తుల( కొరకు) పంపకంలో
ద్వేషాలు పెంచుకుంటున్నారు
అనుబంధాలు తెంచు కుంటున్నారు
తోడబుట్టిన వారినే
దూరం చేసుకుంటున్నారు
అనురాగాలకు దూరమవుతూ
ఆస్తులను పంచుకుంటున్నారు
ఎదురు తిరిగితే హత్యలు
కూడా చేయిస్తున్నారు
ఈ దుస్థితి మాకు రానివ్వలేదు
మా నాన్న ఆస్తులను సంపాదించి
మాకు ఆ అవకాశం ఇవ్వలేదు
మా నాన్న గొప్ప ఘనుడు 
మా నాన్నే మాకు ఆస్తి, సిరి,
సంపద,దైవం
మా నాన్న మాకు ఒక గొప్ప
పాఠం నేర్పాడు
స్వశక్తి యే భుక్తి అనే సూత్రం.
జోహార్ నాన్న! నీకు జోహార్ !!
( పితృ దినోత్సవ సందర్భంగా )

కామెంట్‌లు