కం
అతిగా భయపెట్ట వలదు
గతినే మార్చేసు కొనునుఘనమార్జాలమ్
మతి లోచనతో తరిమే
నుతినే విని పరుగుతోడ నుటకాయించున్
కం
అతి మధురమైన మాటలు
వెతలగతినిమార్చునెపుడు వేలుపు వోలెన్
సతతము సుమతికి నీడలు
నుతితోడనె సాధ్య పడును నుర్విన మనసా!
కం
అతిరుచి గల భోజనమును
మితముగ తినవలెనెపుడు; నమృతమే యైనన్
మతిదప్పించే మధువుచె
నుతిశృతిగతి దప్పుచుండునోయీ విధమున్
కం
అతిగా భక్తిన మునిగా
గతినెరగక బురదలోన కన్నకొడుకునే
మతి నీపైనే బెట్టీ
నుతిజేయుచు త్రొక్కెచూడు నుర్విన విఠలా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి