సీ.
చిన్నతనమునందు చిందులువేస్తునే
పలకబలపముతో బడికివెళ్ళ
ఒకటవతరగతి ఓనమాలనునేర్వ
బుద్ది పెరుగుచుండు ముద్దుగాను
నేర్చినపిదపను నేర్పుతోమనలను
పైతరగతులకు పంపుతారు
గురువుమెచ్చుకొనియు గొప్పగామనకెంతొ
దేవునంతటిగొప్ప దీవెనిచ్చు
*ఆటవెలది*
శ్రద్ధతోడచదువ సకలమ్ము నీచెంత
వచ్చిచేరునుగద వదలకుండ
ఈకరోన వ్యాధి నిబ్బంది పెట్టగా
చదువులాగి పోయె సర్వమందు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి