ఉరివేసే యురేనియం :-గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

యురేనియం యురేనియం యురేనియం
ఉర్విలోన దాగివున్న ఈ యురేనియం
దరిదాపుల్లో ఉండకుండా తరిమేసే యురేనియం !

నల్లమల అడవి తల్లి గర్భంలో తాను దాగి ఉందంట
ఉల్లములో పరిఢవిల్లి వెంటనే స్పందిస్తుందంట

లాభనష్టాలను సరిచూసుకోమంటుందంట
ముందుగానే పసందైన విందును తనిస్తుందంట !

పచ్చనైన పుడమితల్లి వెచ్చని హృదయాన్ని గిల్లి
గేయాల గాయాలతోతుళ్ళి వలను తాను అల్లి
సర్కారు గుచ్చింది అవన్నీ తల్లి గుండెలో పిడిబాకు
తకరారు చేస్తున్న గిరిజనుల తండాల్లో మస్తు చిచ్చు రేపు !

వెలికితీస్తే ఇది సృష్టించునువిధ్వంసం
ఉరేనయంఅనిఆలోచిస్తేమదిలోఏదోమీమాంసం
గోతి తీసి గోలుమాలుచేయు అనుశాస్త్రపాఠ్యంశం
మూతి మూసి ఓనమాలు అభ్యసించు సారాంశం!

వీచే గాలిలోన చేరి పోవు దుమ్ము ధూళి
చూచే వారి గుండెల్లో దూరి పోవు
గాలి పేలి
జనం చేతుల్లో నీవు వెంటనే సొమ్ము సోలి
నిజం తెలుసుకోను రాఇకమోఖాపైన వాలి !

ప్రకృతి అంతా కాలుష్యం నిండు ట ఖాయం
బ్రతికే జీవజాలానికి అవుతుంది లే గాయం
చితి పేర్చిన మానవ బ్రతుకంత భయం భయం
గోతి పూడ్చిన మరుభూమిలో సొమ్మంతా వ్యయం వ్యయం !

అందుకే అంతా ప్రతిఘటించి
తవ్వకాలను ఆపేద్దాం ఆపేద్దాం 
ముందుకు శాంతంగా అధిగమించి
అందరిని ఒకటిగా చేద్దాం చేద్దాం !


కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ను
ఐక్యమత్యంతో మనం ఆపేద్దాం
జనజీవన సుఖ శాంతి సుగతికై
సర్కారుకు కనువిప్పునుకలిగిద్దాం