మా సోమన్న బొమ్మలు:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రాణమున్న బొమ్మలు
ప్రాణమిత్రుని బొమ్మలు
సోకుగున్న ఈ బొమ్మలు
మా సోమన్న బొమ్మలు !

అల్లిబిల్లి బొమ్మలు
బుల్లిబుల్లి బొమ్మలు
అమ్మ చెల్లి బొమ్మలు
మా సోమన్న బొమ్మలు !

మాటలాడే బొమ్మలు
ఆటలాడే బొమ్మలు
పాట పాడే బొమ్మలు
మా సోమన్న బొమ్మలు !

మన్నికైన బొమ్మలు
ఎన్నికైన బొమ్మలు
మిన్నైన బొమ్మలు
సోమన్న బొమ్మలు !

కుందనాల బొమ్మ లు
చందనాల బొమ్మలు
వందనాల బొమ్మలు
ఈ సోమన్న బొమ్మలు !

రంగు రంగుల  బొమ్మలు
హంగు పొంగుల బొమ్మలు
సరంగు ఫిరంగుల బొమ్మలు
గద్వాల సోమన్న బొమ్మలు !

చింగ్ చాంగ్ బొమ్మలు
చైనా దేశం బొమ్మలు
మా మైనం బొమ్మలు
మా సోమన్న బొమ్మలు!

చిట్టి పొట్టి బొమ్మలు
లొట్టి పిట్ట బొమ్మలు
అమ్మకుట్టి బొమ్మలు
సోమన్న బొమ్మలు  !

ప్రాణం ఉన్న ఈ బొమ్మలు
నిస్త్రాణం లేనిమాబొమ్మలు
నే ప్రస్తావించుఈ బొమ్మలు
మా నేస్తం మంచి బొమ్మలు !

శివ మూగే శివంగి బొమ్మలు
రేలారే శ్రీ రేలంగి బొమ్మలు
భళారే ఈ లవంగి బొమ్మలు
సోమన్న మా మంచి బొమ్మలు !

సింగిడి వయసు బొమ్మలు
పసి(డి)మనసు బొమ్మలు
ఈగద్వాల్ గంధం బొమ్మలు
మా అడ్మిన్ అందాల బొమ్మలు !