చిమ్నీలు(ప్రక్రియ):-పి.హజరత్తయ్య
 1)మంచి లక్షణాలు
అలవర్చుకోవాలి
దుష్ట లక్షణాలు
వదిలించుకోవాలి

2) సంకల్ప బలముతో
కార్యాన్ని సాధించు
బుద్ధి బలముతో
జ్ఞానాన్ని పెంచు

3) తెలుగు భాషను
అభ్యసించండి
అమ్మ భాషను
కాపాడండి

4) గురువులు బోధించిన
శిష్యులు నేర్చుకొనును
పెద్దలు వివరించిన
పిల్లలు పాటించును

5) మంచి వారితో 
స్నేహము చేయుము
చెడ్డవారితో 
చెలిమి ప్రమాదము

6) లక్ష్యసాధనకు
గురిపెట్టినవాడు
ఉన్నతస్థాయిని
 అందుకుంటాడు

7) పిల్లలకు స్ఫూర్తి
పెద్దలే కావాలి
పెద్దలకు కీర్తి
పిల్లలే తేవాలి

8) అపోహలు వలన
అపార్ధాలు పెరుగు
అసూయ వలన
అనర్థాలు కలుగు

9) అడవి బిడ్డలను 
ఆదరించండి
పేద పిల్లలకు
సహకరించండి

10)మానవతా విలువలు
మంచిని పంచు
ఆధ్యాత్మిక విలువలు
భక్తిని పెంచు

11) వాడుక భాషను
వెలిగించెను గిడుగు
తెలుగు దేశమున
మెరిసెను గిడుగు

12)మన తెలుగుభాష 
మధురమైనది
అజంత భాష
అజరామరమైనది

13) ఆటలు వలన 
ఆరోగ్యం కలుగు
పాటల వలన
ఆనందం పెరుగు

14)ఆటల పోటీల్లో
విజయం ముఖ్యం
క్రీడాకారుల్లో
ఆనందం తధ్యం

15)రైతులు పొలాల్లో
శ్రమిస్తారు
కష్టజీవులు
కాయకష్టం చేస్తారు

16) తోటలో పువ్వుల
అందము చూడు
తొలకరి జల్లులు
సొగసు చూడు

17 అన్నదానం
ఆకలి తీర్చును
అక్షర జ్ఞానం
అజ్ఞానం త్రుంచును

18) ఉపాధ్యాయులు
తేజో సంపన్నులు
స్ఫూర్తిప్రదాతలు
ఆదర్శవాదులు

19) జాతిని మలిచే
శిల్పులు గురువులు
విలువలు నిర్మించే
వారధులు గురువులు

20) గురువు సామర్థ్యాన్ని
రెట్టింపు చేయును
గురువు జీవితాన్ని 
మలుపు తిప్పును

21) ప్రతి ఒక్కరికి
కష్టాలు వస్తాయి
ఎవడి బ్రతుకుకి
తగ్గట్టు అవస్తాయి

22)కష్టాలు ఎవ్వరికీ
శాశ్వతం కాదు
కష్టాలు మనిషికి
ప్రమాదం కాదు

23)భూమి మీద నీది
అంటూ ఏమి లేదు
నీ శరీరం మీద
హక్కు నీకు లేదు

24) సముద్రం చూచుటకు
ప్రశాంతంగా ఉంటుంది
సముద్రం ఈదడానికి
కష్టంగా ఉంటుంది

25) ఆత్మాభిమానము
మేలు చేస్తుంది
అహంకారము
కీడు చేస్తుంది

26) సమస్య వెనుక
సమాధానం యుండు
కష్టం వెనుక 
అవకాశం యుండు

27) ఉపాధ్యాయులు
సమాజ నిర్మాతలు
ఉపాధ్యాయులు
దేశ సౌభాగ్యాలు

28) గురువుల మన
కల్పతరువులు
ఉపాధ్యాయులు
మన కామధేనువులు

29) ఎవరు చనువుఇచ్చినా
హద్దులు దాటకు
కెరటాలు తాకినా
ఓర్పును విడవకు

30) మంచివాడు వైరికి
సాయం చేస్తాడు
దుష్టుడు మిత్రునికి
ద్రోహం చేస్తాడు
31) ధర్మం తప్పితే
దుఃఖం తప్పదు
ధనం పెరిగితే
అనర్థం తప్పదు

32) చెట్లు నరికితే
 వినాశనం జరుగు
చెట్లను పెంచితే 
ఆరోగ్యాలు పెరుగు

33) వాన చినుకులకు
హద్దు లేదా
మనిషి జన్మలకు
కరుణ ఉండదా

34) బాగు పడుతుంటే
ఏడవడం వద్దు
బాధ పడుతుంటే
నవ్వడం రద్దు

35) పురుగులా ఉంటే
చిరాకు పడతారు
చిలుకలా ఉంటే
మురిసిపోతారు

36) ఏదో పోయినట్టు
ఎప్పుడూ ఉండకు
ఏమి పోనట్టు
సాగు ముందుకు
37) అల వచ్చినప్పుడు
తలను దించాలి
గొడవ అయినప్పుడు
అడుగు వెనక్కెయాలి

38) క్షమించే గుణము
చాలా మంచిది
ఓదార్చే హృదయము
 కావాలి అందరిది

39) ఖరీదు బట్టలతో
బ్రతకడం కన్న
మంచితనంతో 
బ్రతకడం మిన్న

40) మనిషిని గెలిచే
ప్రేమ మధురము
మనసును ఓదార్చే
వివాహం పవిత్రము

41) దేవుడు ఉన్నాడని
పేదవారి ధైర్యం
ఆస్తి ఉన్నదని
ధనవంతుల ధైర్యం

42) కోపడ్డప్పుడు
పేదవాడిగా ఉండు
ప్రేమ ఉన్నప్పుడు
ధనవంతుడై ఉండు

43) ఓర్పు అనేది
క్లిష్టమై ఉంటుంది
ప్రతిఫలం అనేది
కమ్మగా ఉంటుంది

44) సమయం మారితే
పరిస్థితులు మారును
బంధాలుపెరిగితే
బాధ్యతలు తెలియును

 45) మనం గెలిస్తే
వెంట నడుచు కొందరు
మనం ఓడితే
నడిచేది ఎందరు?

46) ఆకలి వేస్తే
అవసరం తెలుసును
ఆలోచన వస్తే
బ్రతకడం నేర్చును

47) వినేటప్పుడు
వినయం తెలియాలి
అడిగేటప్పుడు
లౌక్యం మెరవాలి

48) మనం మెచ్చేవారు
మన బంధువులు 
మనసు నచ్చిన వారు
ఆత్మ బంధువులు

49) మనకు ఆనందమే
ఆరోగ్యాన్నిచ్చు
మన ఆరోగ్యమే 
మహాభాగ్యానిచ్చు

50)స్నేహమంటే
సుమధుర బంధము
బంధమంటే
ఆత్మీయ రాగము

51) స్నేహ మన్నా
కలిసి తిరగడం
వంద తప్పులు ఉన్నా
తోడుగా ఉండడం

52) విలువతెలుస్తుంది
బంధం పోయినపుడు
బుద్ధి తెలుస్తుంది
బంధం తెగినపుడు

53) నవ్వు చిన్నదైనా
చింతలను తీర్చు
ప్రయత్నమేదైనా
ఆశను నెరవేర్చు

54) విలువ లేని చోట
గెలవదు నిజము
విలువ ఉన్న చోట
గెలిచు అబద్ధము

55) మరణించే వాడిని
బ్రతికించు మాట
బ్రతికి ఉన్న వాడిని
చంపు అదే మాట

56) చిరునవ్వు వెనక
బాధ ఉంటుంది
కోపం వెనుక 
ప్రేమ ఉంటుంది
57) కోరిక మాత్రం
కొన్నాళ్ళు బతికించు
ఆశయం మాత్రం
చానళ్లు జీవించు

58)ప్రేమ ఎక్కువైతే
బాధ తప్పదు
ఆశ ఎక్కువైతే
దుఃఖం తప్పదు

59) చక్కని బంధము
నిస్వార్ధమైనది
స్వచ్ఛమైన స్నేహం
శాశ్వతమైనది

60) రక్షిస్తానని
చెట్లు చెప్పును
భక్షిస్తానని
సంపద తెలుపును

61) గర్వపడాలి
బతికితే సమాజము
కన్నీరు పెట్టాలి 
చస్తే స్మశానము

62) బంధువులు వస్తారు
డబ్బు ఉంటేనే
మిత్రులు నిలుస్తారు
మంచి ఉంటేనే

63) పొగిడే మనుషులను
మరిచిన ఏమి కాదు
సాయ పడినోళ్ళను
మరవకూడదు

64) నమ్మకం ఉన్న
అర్థం నిలుచును
నమ్మకం లేకున్న
అపార్థం మిగులును

65) కష్టం నీకు వస్తే
నీది అంటారు
సంతోషమొస్తే
మనది అంటారు

66) దసరా అంటేనే
సరదా, సందడి
దశమి అంటేనే
నవ్వుల సవ్వడి

67) ప్రశ్నించే తత్వం
పెంచును విజ్ఞానం
 మనిషి తత్వం
పెంచును అజ్ఞానం

68) ప్రకృతి మనందరికి
సలహా ఇస్తుంది
ప్రకృతి మనిషికి
రక్షణనిస్తుంది

69) ఒకరి మనసులో
స్థానం సాధించు
అందరి మనసులో
గొప్పగా నిలుచు

70) రాలిన పువ్వులు
దొరకక పోవచ్చు
బలమైన కొమ్మలు
మళ్లీ పూయవచ్చు

71) జీవితమంటే
కష్టసుఖాలు
బతకడమంటే
సుఖదుఃఖాలు

72) స్థితి ఎప్పుడూ
స్థిరం కానే కాదు
కష్టం ఎప్పుడూ
వృధానే పోదు

73) జీవితం ఎవరికి
శాశ్వతం కాదు
ప్రాణం ఎప్పటికి
నిలువ జాలదు

74) శుద్ధి చేస్తుంది
స్నానం దేహముని
బాగు చేస్తుంది
ధ్యానం బుద్ధిని

75) భగవంతుడు మాత్రం
కోర్కెలను తీర్చడు
మానవుడు మాత్రం
కోర్కెలను ఆపడు

76)అన్నదానం
ఆకలిని తీర్చును
అక్షర దానం
జ్ఞానం పెంచును

77) మాటలు పెరిగితే
బంధాలు తెగును
మాటలు జారితే
దూరం పెరుగును

78) నీరు లేకపోతే
బావి కాడకు రారు
డబ్బు లేకపోతే
మనిషి దరిచేరరు

79) ఎవ్వరి నుంచి
ఏది ఆశించకు
అతిగా ఆశించి
నీవు భంగపడకు

80) నీడ ఉన్న చోట
వెలుగు వచ్చును
కష్టాలున్న చోట
సుఖాలు కలుగును

81) బంధం అనేది
చాలా విలువైనది
బాధ్యత అనేది
బరువుతో కూడినది

82) నేటి బాలలే 
రేపటి పౌరులు
నేటి పిల్లలే
భవితకు పునాదులు

83) బాల కార్మికులు
బాల్యం ఎరుగరు
బాలల హక్కులు
వారు అనుభవించరు

84) నవ్వులుపువ్వులు
 విరిసే బాలలం
కుల మత భేదాలు 
ఎరుగని పిల్లలం

85) కళ్ళు కలలను
మర్చి పోజాలదు
ఊపిరి ప్రాణమును
విడువ జాలదు

86) హక్కులు ఉన్నాయని
తెలియని  బాలలం
హక్కులను  కాచమని
వేడుకును పిల్లలం

87) జాబిలి వెన్నెలను
మరువనే మరవదు
మనసు స్నేహమును
విడవనే విడవదు

88) శాశ్వితం కావు
మన జీవితాలు
నిత్యము ఉండవు
జీవిత సమస్యలు
89) నీలోన దాగాలి
నీలోని లోపాలు
నింగికి ఎగరాలి
నీలోని ప్రతిభలు

90) అందరికీ విద్య
నూతన విధానము
జాతీయ విద్య
ఒక మంచి సాధనము

91)  చెడ్డతనం మనల్ని
ఒంటరిని చేయును
మంచితనం మనల్ని
గొప్పగ నిలబెట్టును

92) శాంతాన్ని మించిన
తపస్సు లేదు
సంతోషం మించిన
ఆరోగ్యం లేదు

93) డబ్బు చెబుతోంది
సంపాదించమని
సమయం చెబుతోంది
అనుసరించమని

94) మేలు కోరేవారు
ప్రశ్నిస్తు ఉంటారు
కీడు చేసేవారు
పొగుడుతూ ఉంటారు

95) కాలగమనమును 
ఎవరూ మార్చలేరు
జీవన గమనమును
వృధా చేసుకోరు

96) మనిషి నిద్రపోతే
అన్నింటిని మరువును
నిద్ర రాకపోతే
జ్ఞాపకాలు నేర్వును

97) సరైన ఆలోచన
నిజమైన పెట్టుబడి
సరైన అవగాహన
నేర్పు చదువుల గుడి

98) మెట్లు ఎక్కితే
మేడ పైకి చేరును
ఏటికి ఎదురిదితే 
తీరం దరి చేరును

99) మంచి అలవాటు లే
పిల్లలకు సంపదలు
మంచి జ్ఞాపకాలే
పెద్దలకు ఆస్తులు

100) చెడును చూడడం
మనిషి వ్యక్తిత్వం
మంచిని వెతకడం
మనిషి మహత్వం