సంజీవని,ఏరువాక(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

         :సంజీవని:
ఆకు పసరును మందుగా ఆర నిచ్చి
చేసి చూపెడి వైద్యము చేవ గలిగి
చరక సంయుతు లెల్లరు చాటి చెప్పి
మహిని నిలిపిరి సంజీవ సమము గాను
             :ఏరువాక:
హలము చేతను బట్టిన‌ హాలి కుండు
మొదలు బెట్టెను సేద్యము‌ మోద మలర
విత్తు నాటిన రోజున‌ విరులు చల్లి
వివిధ పనులను జేసెను విరివి గాను
కామెంట్‌లు