బాలలూ రారండీ...:-మొహమ్మద్.అఫ్సర వలీషా

ఒంటరి జీవితాన్ని వదిలేసి
ఒక్కొక్కరిని పోగేసి
ఒకింత సంతోషాల పువ్వులను 
అంబరాన ఎగరేసి
ఒత్తిడిని చేద్దామా నుసి నుసి  
ఆట పాటలతో.....!

అరవిరిసిన గులాబీల
అలసిపోయే చదువులకు
అప్పుడప్పుడు చెక్ పెడదాం...

అలరించే అందమైన కధలతో  
ఆటపాటలతో ఆనకట్ట కడదాం
ఓనమాల బడి నుండి అమ్మ ఒడి చేర్చుదాం
వ్యక్తిత్వ వికాసం వికసింప చేద్దాం....

అంతరంగపు పొరల మాటున దాగిన
ఆవేదనా పుటలను
ఆంతరంగిక ఆప్తుల మధ్య  
ఆట పాటలతో తిరగేద్దాం
ఆనంద సాగరంలో తేలుదాం.....!

శారీరక , మానసిక 
శరీర ధారుడ్యాన్ని పొందుదాం...

కోతికొమ్మచ్చి, చెడుగుడు, ఖోఖో, 
వానాగుంట, నేలబండ,తొక్కుడు బిళ్ల
టెన్నిస్, హాకీ,క్రికెట్,చదరంగం 
ఆడేద్దాం...

చెమటను చిందించి
చక్కని ఆరోగ్యాన్ని
చకచకా పొందేద్దాం...

(క్రీడా దినోత్సవ శుభాకాంక్షలతో)
మొహమ్మద్. అఫ్సర వలీషా 
ద్వారపూడి (తూ గో జి) 

కామెంట్‌లు