మార్పు తెచ్చిన తీర్పు ( బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  కొడుకు పోషించటం లేదని న్యాయాధికారి  వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు ముసలి రాజయ్య. వెంటనే కొడుకును పిలిపించాడు న్యాయధికారి.  నిజమే అన్నాడు కొడుకు. "ఎందుకు పోషించటం లేదు?" అడిగాడు అధికారి.  "నన్ను చిన్నప్పుడు చదివించి ఉంటే, మంచి ఉద్యోగం సాధించి, తండ్రిని బంగారంలా చూసుకునే వాడిని.  ఇప్పుడు చాలీచాలని కూలితో   నన్ను నేనే పోషించుకోవడం కష్టంగా ఉంది" చెప్పాడు 
     న్యాయాధికారి కాసేపు ఆలోచించి  "ఇద్దరి వాదనలు నిజమే కాబట్టి, తండ్రిని పొషించనందుకు కొడుకుకు, కొడుకును చదివించనందుకు తండ్రికి  చెరి వంద కొరడా దెబ్బలు కొట్టండి" అని తీర్పు చెప్పాడు న్యాయాధికారి. ఇదేం తీర్పు అనుకున్నారంతా. తీర్పు ప్రకారం కొడుకును వంద కొరడా దెబ్బలు కొట్టారు. కొడుకును కొడుతుంటే తండ్రి విలవిలలాడాడు. అలాగే తండ్రిని వంద కొరడా దెబ్బలు కొట్టారు. అప్పుడు కొడుకు కూడా బోరున ఏడ్చాడు. ఆ తరువాత ఒకరినొకరు ఓదార్చుకుని ఇంటికి వెళ్లారు. అన్యోన్యంగా వుండసాగారు. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. బయట వారికి చెబితే  ఇలాగే ఉంటుంది మరి.