అది1754సంవత్సరం. 29ఏళ్ళ అహల్య భర్త మరణం తో చితి ఎక్కబోతోంది. అమ్మా అంటూ ఐదేళ్ల ఆమె కొడుకు కాలికి అడ్డం పడి ఏడవసాగాడు.బేటీ అంటూ వృద్ధుడి గంభీర కంఠం వినపడినది. "ఆచారం పేరు తో నీవు బలికావటం నాకు బాధ. నీభర్త స్థానంలో నీవే రాజ్యంచేయాలి.పసివాడి ఆలనపాలనతోపాటు యుద్ధవిద్యలు నేర్చుకోవాలి'అన్న మామగారిమాటలతో ఆమె జీవితమే మారిపోయింది. 1766లోకొడుకు 1767లోమామగారు చనిపోయినాక ప్రజారంజకపాలన సాగించిన ఆమె గొప్ప తనం మనకు తెలీదు.
1795దాకా ఇండోర్ రాజ్యంని పాలించిన అహల్య బాయికి వ్యతిరేకంగా మరాఠా సుబేదార్లు తిరుగుబాటు చేశారు. ఆడపెత్తనంఅని తనకు ఎదురుతిరిగినవారిని అణచివేసి ఒక మహాశక్తిలాగా అవతరించింది. నర్మదానది ఒడ్డున మల్లేశ్వరం అనేరాజధానిని కట్టించింది.మాళ్వాప్రాంతాన్ని ప్రజారంజకంగా పాలించింది. స్త్రీల పరదాపద్ధతికి స్వస్తి పలికింది. మహిళా సేనను ఏర్పాటు చేసి వనితలకు యుద్ధశిక్షణ ఇప్పించినది. వితంతువు లకు భర్త ఆస్తి వచ్చేలా ఏర్పాటు చేసినది.బడులు నెలకొల్పింది. వాటికోసం మాన్యాలు ఇచ్చింది.చెరువులు కాలువలు తవ్వించి వ్యవసాయంకి దోహదం చేసిన ది.మల్లీశ్వరం చీరలనేత ఆమె కాలంలో ఆరంభం అవటం ఇంకో విశేషం. మనదేశంలో ఎక్కువ శివాలయాలు కట్టి ఆధ్యాత్మిక రంగంలో ఆమెచేసిన సేవ అపురూపం. కాశీద్వారక అయోధ్య ఇలా అన్నిప్రాంతాల్లో శిధిల ఆలయాలను పునరుద్ధరణ చేసి న ఏకైక రాణి ఆమె!10జ్యోతిర్లింగాలను ప్రతిష్టించింది.1725లోచౌండీకి చెందిన మంకోజీషిండే దంపతులకు పుట్టి న అహల్య వివాహం మరాఠా వాడైన ఖండేరావు హోల్కర్ తోజరిగినది. పదో ఏట ఇల్లాలైన ఆచిన్నారి 29ఏళ్ళ కే భర్తను పోగొట్టుకున్న విధివంచితురాలు.కానీ మంచి పరిపాలనదక్షురాలు.భారత ప్ర భుత్వం ఈమెపేర స్త్రీ శక్తి పురస్కారాలు ఇస్తోంది. ఇండోర్ విమానాశ్రయం కి దేవి అహల్యబాయిహోల్కర్ అని పేరు పెట్టారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులుగారు ఈమె పేరుతో ఒక నవల రాశారు. 1958లో ఆపుస్తకం పదోక్లాసు పిల్లలకి ఉపవాచకంగా ఉండేది. ఈమె స్ఫూర్తి తో అమ్మాయిలు సైన్యంలో చేరుతున్నారంటే అతిశయోక్తి కాదు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి