అనగనగా ఒక ఊరిలో సూరయ్య అనే రైతు ఉండేవాడు.అతను తన రెండెకరాల పొలాన్ని వ్యవసాయం చేస్తూ పక్షులను కూడా వేటాడి అమ్ముతూ జీవనం సాగించేవాడు.
సూరయ్య తమ పక్షి జాతికి అన్యాయం చేస్తున్నాడని పక్షులన్నీ కూడబలుక్కుని అతని పొలం వైపు రావడం మానేశాయి.ఫలితంగా సూరయ్య పొలంలో పురుగులు కీటకాలు ఎక్కువైపోయి పంట పండేది కాదు.ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంటే విసుగు చెంది వ్యవసాయం మానివేసి పూర్తిగా పక్షులను వేటాడటమే జీవనోపాధిగా మార్చుకున్నాడు సూరయ్య.
ఒక రోజు వేటాడుకుని తిరిగొచ్చే సమయంలో గువ్వ గూడుని చూసాడు.ఆగూడు చుట్టూ ఉరులు వేసి ఇంటికి వచ్చేసాడు.మరుసటి రోజు వెళ్లి చూసేసరికి గువ్వ ఉరులకి చిక్కింది కానీ ఉరి మెడకు బిగుసుకుని చనిపోయింది.ఆ గూటిలో నాలుగు పిల్లలున్నాయి. సూరయ్య అలికిడి విని వచ్చింది తన తల్లి అనుకుని పాక్షిపిల్లలు నోరు తెరిచి ఆహారం కోసం కిచ కిచ అని శబ్దం చేస్తున్నాయి.ఆ దృశ్యం చూసిన కఠిన మనస్కుడైన సూరికి కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.పరుగు పరుగున వెళ్లి మేత తీసుకొచ్చి పిల్లలకు అందించాడు. అప్పటి నుంచి పిల్లలు పెద్ద అయ్యే వరకు రోజు వచ్చి మేత అందించేవాడు.పిల్లలు పెరిగి పెద్దయ్యి రెక్కలొచ్చి ఎగిరిపోయే వరకు కంటికి రెప్పలా కాపాడి సంరక్షించాడు.
ఆ రోజు నుంచి తను పూర్తిగా మారిపోయి వేటాడటం మానేసాడు.ఇతరులు ఎవరైనా పక్షులకి ఉరులేసినా, వేటాడిన వేటాడనిచ్చేవాడు కాదు.పక్షులకు తనకు తోచినంత మేరకు రోజు ఆహార గింజలు వేసేవాడు.
అప్పటినుంచి తను బుద్దిగా కష్టపడుతూ తన రెండు ఎకరాల పొలం మరియు కొంత పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసుకోసాగాడు.
మారిన సూరయ్యను చూసి
పక్షులు కూడా సూరయ్య పంట పొలంలో ఉన్న పురుగులను, కీటకాలను రోజు వచ్చి తినేసి వెల్లిపోయేవి.పంటలను చీడ పీడలనుండి కాపాడేవి.అలా పిట్టలు సూరయ్యకు సహాయం చేసి ఆదుకునేవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి