మొద్దు నిదుర వీడాలి
ప్రొద్దున్నే లేవాలి
దైనందిన బ్రతుకులో
దేవున్ని జపించాలి
పళ్ళు బాగా తోమాలి
శుచిగ స్నానం చేయాలి
ఉతికిన బట్టలు తొడగాలి
శుభ్రతను పాటించాలి
వేళకు బడికి పోవాలి
వేళాకోళం మానాలి
గురువుకు దండం పెట్టాలి
కరమున పొత్తము పట్టాలి
చదువులు చక్కగ చదవాలి
సంస్కారమే నేర్వాలి
ఉన్నతంగా ఎదగాలి
ఊరికి పేరు తేవాలి
మొక్కలెన్నో నాటాలి
చెట్లు చాలా పెంచాలి
పర్యావరణ పరిరక్షణకు
అందరూ కృషి సల్పాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి