కాలం విలువ (కథ):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట

  కాసపురం అనే ఒక చిన్న పల్లెటూరు లో, కామేశ్వరయ్య అనే భూస్వామి. అతని భార్య మహేశ్వరి,
       వారి పిల్లలు ఉద్యోగరీత్యా పట్నం లో నివాసం.
     **********
  వేసవి సెలవులు రాగానే, పిల్లలంతా కాసపురం చేసుకునేవారు.
నానమ్మ చేసిపెట్టే రుచికరమైన వంటలు తినుకుంటూ, తాత చెప్పే కథలు విను కుంటూ, ఎగురుతూ, దూకుతూ హాయిగా కాలక్షేపం.
       ...............
 ఒకరోజు పిల్లలందరినీ వెంట తీసుకుని, ఊరు పక్క నున్న పెద్ద చెరువు వద్దకు, తీసుకు పోయి చెరువు గట్టున కూర్చోబెట్టి తన వెంట తెచ్చిన, చేపలకు వేసే ఆహార ధాన్యాన్ని, పిల్లల చేతికిచ్చి చెరువులో చల్లించగా చేపలు చెంగు చెంగున ఎగురుతూ, వేసిన ఆహారధాన్యం మింగుతూ, నీటిపై ఆడుతూ ఉంటే పిల్లలు చూసి చాలా సంతోషించారు.
     కామేశ్వర య్య పిల్లలందరినీ పిలిచి చేపల చురుకుదనం చూశారా అని అడిగాడు.
అవును తాత చేపలు ఎంతో చురుగ్గా ఉన్నాయి!
అవును కదా మీరు కూడా చేపల వలే చురుగ్గా ఉండాలి అని చేపల చురుకు ధనము గూర్చి పిల్లలకు చూపాడు.
       *************
అచటి నుండి పిల్లలను ధోబి కుంటకు తీసుకెళ్లాడు.
అక్కడ ఒక తాబేలు నివాసముంటుంది. దానికి కూడా తినడానికి ఆహార ధాన్యాలు వేస్తాడు. కామేశ్వరయ్య మాట ద్వని వినగానే నీటిలో నుండి తాబేలు గట్టు పక్కకు వచ్చింది.
   పిల్లలతో దానికి కూడా తెచ్చిన ధాన్యము వేయించగా. తాబేలునెమ్మదిగా వేసిన ఆహారాన్ని తింటుంది.
పిల్లలు ఎంత అల్లరి చేసినా కానీ దాని పని అది చేసుకుని నీటిలోకి జారుకున్నది. పిల్లల్లారా చూసారు కదా తాబేలు ఓపికను. ఎవరేమన్నా కానీ ఆవేశానికి రాకుండా.మన పనులు మనము చేసుకోవాలి అని తాబేలు తో సహనాన్ని పోల్చి చెప్పారు.
        ................
    "తాతగారు" అచటి నుండి చెలుకకు తీసుకెళ్లారు. అక్కడ  గరక తుప్ప లో కుందేళ్లు గరక మేస్తూ, వీరిని చూసి దొరకకుండా పరుగులు తీస్తూ కనబడనంత దూరం వెళ్ళిపోయాయి.
      తాతగారు పిల్లలను పిలిచి ఆ కుందేళ్ళ పరుగు చూశారా! ఆ పరుగు ఆగని సమయం లాంటిది అందుకని గడిచే ప్రతి క్షణం చాలా విలువైనది.
  సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకుంటే చేసే ప్రతి పనిలో విజయం సాధించవచ్చునని, కుందేలు పరుగుతో పిల్లలకు కాలం విలువ తెలిపారు కామేశ్వరయ్య తాత.

కామెంట్‌లు