మనసున్న మారాజు మంచిమనిషి మా నాన్న.
పురిటి కందు ని గులాబీలా ముద్దాడి గుండెలకు హత్తుకుని మురిసిపోయే వాడు మా నాన్న.
చిట్టి చేతులు పట్టుకొని నడక నేర్పించాడు.
ముద్దులొలికే మాటలు వింటూ భుజాలపై ఎక్కించుకొని ఆటలు ఎన్నో ఆడించాడు.
కథలు ఎన్నో చెప్పి గుండెలపై నిద్రపుచ్చే వాడు.
పలకా బలపం పట్టించి బడిలో చేర్చినప్పుడు నేను వెళ్ళను అంటూ మారాం చేస్తే అడిగినవన్నీ కొనిస్తానని ఆశలు పెట్టి అక్షరాలు నేర్పించాడు.
కండలు కరిగించి కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని విద్యాబుద్ధులు నేర్పించాడు.
తాను పస్తులుండి నా కడుపు నింపాడు.
నా జీవితం కోసం తన జీవితాన్ని తాకట్టు పెట్టాడు.
ఇంటినీ పొలాన్ని సర్వం పోగొట్టుకొని రైతు కాస్త కూలి గా మారాడు.
కొడుకు ఉద్యోగస్తుడైతే చూసి సంబర పడాలని కలలెన్నో అనేవాడు.
ఆరోజు రానే వచ్చింది.
పట్నంలో లో కొడుకు దొరబాబు తండ్రి పని మనిషి లా నా బాబు.
పడిన కష్టాలన్నీ మరిచిపోయి కొడుకు బాగు కోసం తాను బలైపోయాడు.
ఉంటానికి నీడ లేదు తినటానికి తిండి లేదు.
కాడు రమ్మంటే అంటే కొడుకు కోసం చివరి క్షణం దాకా ఎదురు చూసి చూసి విగత జీవి అయ్యాడు.
మనిషిగా తీర్చిదిద్దిన కొడుకు మానవ సంబంధం తో పాటు తండ్రి బ్రతికుండగానే పేగుబంధం తెంచుకొని వెళ్లిపోయిన మనీ మనిషి.
ఇంకా వస్తాడని ఆశగా ఎదురుచూసే పిచ్చి తండ్రికి కొడుకు రెక్కలొచ్చి ఎగిరి పోయాడని ఏం తెలుసు .
పాపం పిచ్చి తండ్రి నాన్న.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి