తుమ్మచెట్టు స్వగతం:- సత్యవాణి

 తుమ్మ చెట్లం మేము
వమ్మైపోయింది మావిలువ నేడు
ఎవరికీ పనికిరాని రానివారమైపోయాము మేము
పట్టించుకొనే వారేలేరీనాడుమమ్ము
ఎవరినీ గుక్కెడు నీళ్ళపోయమని ప్రాదేయపడం మేము
గుప్పెడు ఎరువునూ ఆశించనే ఆశించము మేము
కరువు కాలంలోనైనా కళ కళలాడుతూవుంటాం
చిట్టి చామంతివంటి
చిన్నచిన్న నక్షత్రాలవంటి 
పూలతో నిండుగా శోభయమానంగావున్నా
మా అందాలను పట్టించుకొనేవారేలేరు
మా కలపతో ఒకనాడు కాడినీ మేడినీ చేసారు
బరువులు లాగే బండికి
చక్రాలనూ చేసారు
తిరగలి తిప్పే 
గురుజునూ చేసారు
పశువులను కట్టే గుంజలనూ చేసారు
మేకలు తప్పితే
తుమల్లోనే అనే సామెత
మాగురించేకదా వచ్చింది
చింతాకు కన్నను చిన్నవైన మా ఆకులు 
చింతకాయలవంటి మా కాయలు
పశవులకు పుష్టికరమైన ఆహారమని గ్రహించేవారేరి ఈనాడు
మా తుమ్మచెట్ల మాను నుండి లభించే జిగురును
 మందులలోనూ
వార్నిష్ రంగులలోనూ
ఉపయోగపడతాయనే విషయం ఈనాడు ఎవరికీ తెలియదు
నేడు అందరూ గమ్ అని పిలుచుకొనే ఆ జిగురు నానుండే  లభిస్తుందని 
ఈతరం పిల్లకు తెలియదు కదా
మా తుమ్మలు వంటచెరుకుగా 
కలపగా వుపయోగపడతామనీ
ఇప్పటివారికి తెలయనే తెలియదు
మాకుగల ముళ్ళద్వారా
మమ్మల్ని మేము రక్షించుకొంటూ
 పైరులకూ పంటలకూ
కంచలమై కాపలాకాస్తాము మేమన్న విషయం మరచేపోయారు నేటి మనుష్యులు
అసలు మా ఉనికినే మరిచిపోయారు మానవవులు 
ఈనాడు మా తుమ్మలను పట్టించుకొనవాడు లేక
మ ఉనికిని గుర్తించే వాడు లేక 
బ్రతుకులను భారంగా యీడుస్తున్నాం
ఏనాడైనా తిరిగి మాకూ మంచిరోజులొస్తాయనీ
ఆశతో జీవనం సాగిస్తూవున్నాం
ఇలా సాగిస్తూనేవుంటాము
   
కామెంట్‌లు