ముసుగు మోములు:- అనురాధ మచ్చ

 సీసమాలిక పద్యం

ప్రాచీన కాలము పడతులు పైటను
ముసుగా వాడేరు మోము పైన,
సాంప్రదాయమనియు శాసించి వేయించె
భయముతో కోడళ్ళు బ్రతుకుటకును,
పెళ్లి పిల్లనుజేసి పేర్మితో వేయును
మేనత్త తళుకుళ మేలిముసుగు,
పసి పిల్లలకు వేసె బయటకె ళ్ళునపుడు
దిష్టి తగలకుండ దీప్తి ముసుగు,
పరపురుషుని కంట పడకూడదని వేసె
పడచులు  ముసుగులు బాగుగాను,
యెన్ని యుపాయాలు యేమిజే సిన గాని
కష్టాలు యెన్నియో కాంతలకును,
ఇప్పుడందరు వేయ యింపుయౌ జీవితం
ముసుగులు వాడగన్ ముప్పుదప్పు,
పేద బీద ధనిక భేదాలు లేవు రా
కోవిడు వణికించె కోట్ల ప్రజల,
పాడు కరోనాతో ప్రాణాలు గుప్పిట్లొ
దండన ముసుగులు దాపురించె.
తేటగీతి
దేశ జనులందరిని జూడ దీనస్థితి,
మూతి ముక్కులు మూసేసి మూలనుంచె,
యిల్లే స్వర్గసీమని చెప్పె యీతరముకు,
ప్రాణ విలువ దెల్పెకరోన ప్రాభవమ్ము.

కామెంట్‌లు