కొన్ని రంగుల పేర్లు:---గద్వాల సోమన్న

 పాలవెల్లి తెలుపు
పాలు పెరుగు తెలుపు
పంచదార తెలుపు
హంస మేను తెలుపు
        కోకిలమ్మ నలుపు
       కాకి రంగు నలుపు
       ఎలుక తోలు నలుపు
       ఎలుగు బంటు నలుపు
చిలుక ముక్కు ఎరుపు
సింధూరం ఎరుపు
మందారం ఎరుపు
మన రక్తము ఎరుపు
         అరటిపండు పసుపు
         పసుపుకొమ్ము పసుపు
         రంగులన్ని కలుపు
          ఐక్యతను తెలుపు

కామెంట్‌లు