*పైడిమర్రి*:-అయిత అనిత
పాఠశాలకు శిరమైన ప్రార్థనలో
ప్రతిరోజు చేసే ప్రతిజ్ఙకు రూపకర్త!

చిన్నతనం నుండే దేశభక్తికి పెంపోందించాలని సంకల్పించిన నేత!

పుస్తక పఠనాసక్తి ఎక్కువై
పలు పుస్తకాలను సేకరించిన జ్ఞాని!

కవితలు వ్యాసాలు కథలను రచించి
సందేశాత్మకతను చాటిన కవి!

నేడు మన నోట ఆయన మాట
ప్రతిజ్ఞయై పల్లవిస్తుంది!
అతడే....
పైడిమర్రి వెంకటసుబ్బారావు!