డైరీ...:-- అచ్యుతుని రాజ్యశ్రీ


 ఆపిల్లలంతా పదోతరగతి పాసైనారు.కొందరు ఏడాది అంతా కష్టపడిచదివి మంచిమార్కులు గ్రేడ్ తో పాసైనారు. ఇంకొందరు బొటాబొటీగా పాసైనారు. కరోనా వల్ల గట్టెక్కాము అని సంతృప్తి తో  ఎంచక్కా టి.వి. ఫోన్  ఛాటింగ్ తో కాలం వృధా చేస్తున్నారు. పై క్లాసు పుస్తకాలు  సంపాదించి  చదువుకోవచ్చు.కానీ ఆ పిల్లలందరికీ భిన్నం గా  లత కాలాన్ని  సద్వినియోగం చేస్తోంది. ఒక పుస్తకం లో తన దినచర్య టైంటేబుల్ తయారు చేసి ఆప్రకారం నడుచుకొంటున్నది .ఆమె డైరీలో ఇలా రాసింది. " నేను సూర్యుడు రాకముందే లేచి మొహం కడిగి  గోరువెచ్చనినీటి లో ఉసిరి పొడి కలిపి  తాగి డాబాపై వ్యాయామం చేస్తున్నాను. ఆపై పాలుతాగి ఇంటిపనులు చేస్తాను.రేడియో వింటు  మానసిక వత్తిడి తగ్గించుకుంటున్నా.వినటం వల్ల కళ్ళకి శ్రమ ఉండదు.  మొలక చదువుతూ నేను  రచనలు చేయాలని  ప్రయత్నాలు ఇవ్వాళ్టినుంచీ ప్రారంభిస్తాను. ఖాళీ డబ్బాలలో మట్టి వంటింటి కూరతొక్కలు వేసి  ఎరువు తయారు చేసి  దానిలో రావి వేప బాదంగింజలు పాతాను. ఇప్పుడు చిన్నమొలకలు వచ్చాయి.ఇక నేను  ఓకొత్త ప్ర యోగం మొదలు పెట్టాను. అదేమిటో తెలుసా?వాడేసిన కాఫీ పొడి చాయ్ పొడి వేసి ఆ మొక్కలతో ప్రేమగా మాట్లాడుతాను.ఇలా మాట్లాడుతాను"అబ్బో!ఎంత  అందంగా లేతచిగుర్లతో ముచ్చట గా  ఎదుగుతున్నారు.ఎండలో మెరిసిపోతున్నారు.ఇంకా పెద్ద అయితే  మా హాల్లో మిమ్మల్ని పెడితే   ఎంచక్కా  మీరు  కూడా రేడియో  వినవచ్చు. అంతా మీగురించిమాట్లాడుతుంటే భలే సంతోషంగా ఉంటుంది కదూ? ఆ!మొక్కలతో ప్రేమగా మాట్లాడితే అవి ఆనందంతో ఎదుగుతాయి. ఒకపరిశోధనలో ఇది రుజువైంది. రెండు  పాత్రలలో నీరు నింపారు.ఒకదానికి ఆకుపచ్చ దారం చుట్టి మంచిమాటలు పాటలు వినిపించి  డీప్ ఫ్రిజ్ లో  పెట్టారు.రెండో పాత్రకి ఎరుపు రంగు దారంచుట్టి పిచ్చి మాటలు తిట్ట్లు వినిపించి  ఫ్రిజ్ లో పెట్టారు. ఇలా ఒక్కొక్కరూ ప్రయోగాలు చేశారు. కొద్ది రోజుల తర్వాత వాటిని చూసి విస్తుబోయారు.ఆకుపచ్చ దారంపాత్ర ఐస్ పై అందమైన దృశ్యాలు  రంగులు  ఏర్పడినాయి.ఎర్రరంగు పాత్ర ఐస్ పై భయంకరమైన ఆకారాలు ఏర్పడినాయి. పాజిటివ్ గా మాట్లాడి సకారాత్మకం గా ఆలోచించితే ప్రకృతి  సహకరిస్తుందని తెలుసుకున్నా రు.అందకే మన పెద్దలు  తథాస్తు దేవతలుఉంటారు.మంచి గా ఆలోచించి మంచి గా మాట్లాడి  మసలుకో అని చెప్పారు.  ఇదీ ఇవ్వాళ నేను రాసుకున్న విశేషాలు "అని లత రాసిన  సంగతులు...