పర్యావరణ-పరిరక్షణం:--ఎన్..రాజేష్--(కవి, జర్నలిస్ట్)

 అనంత విశ్వం
అందు ఎన్నో గ్రహాలు
మనం నివసించేందుకు
ఆవాసం ఈ భూగోళం
ఇందు చెట్లు, జంతువులు,
క్రిమి-కీటకాలకు నిలయం,
అందరి మనుగడ కు కావాలి
స్వచ్ఛమైన నీరు-గాలి,
కానీ సమస్తం నేడు కల్తీమయం..
చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి
పురి గొలపుతున్నాం..
వర్షాభావం,అకాల వర్షాలు,
అతివృష్టి, అనావృష్టి లకు
దారినిస్తున్నాం..
పరిశ్రమలతో విష వాయువులు వెదజల్లి గాలిని సైతం కాలుష్యం చేసుకుంటున్నాం..
పల్లెవదిలి పట్టణం బాటపట్టి విషవలయంలో చిక్కాం..
ఆధునీకరణ పేరుతో ప్లాస్టిక్ వినియోగం పెంచి భూమాతను విషతుల్యం చేస్తున్నాం..
ఇకనైనా మేల్కొందాం..
పర్యావరణంను కాపాడుకుందాం..!
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం..!!