*గురువు దైవ సమానం* :-*"రసస్రవంతి" & "కావ్యసుధ"*9247313488.

 ప్రతి మనిషి జీవితానికి
తొలి గురువు తల్లే
మలి గురువు తండ్రి
పిదప జ్ఞానప్రదాత విద్యా గురువు.
గురువు అంటే మనిషిలోని 
అజ్ఞానపు చీకటిని తొలగించి
విజ్ఞానమనే వెలుగును నింపే వాడు
కొందరు గురువులు
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తె
కొందరు గురువులు
లౌకిక విద్యలను నేర్పిస్తారు
గొప్ప గురువు మాత్రమే
స్ఫూర్తి ప్రదాత మన
జీవితాల్లో నిలుస్తాడు
అన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్
కృష్ణుని వల్ల సాందీపునికి
ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.
యోగి వేమన వంటి భోగి,
గురువు ఉపదేశం వల్లే ప్రజాకవి అయ్యాడు.
గురువు చూపిన గురుతు మరిచిన
దరిగానరు ధరలో ఎప్పుడు
గురువు దైవ స్వరూపం.

కామెంట్‌లు